Telugu News » India vs England : టీమిండియాకు బిగ్‌ షాక్ ఇచ్చిన అశ్విన్‌.. అర్ధాంతరంగా టెస్ట్‌ మ్యాచ్‌ నుంచి నిష్క్రమణ.!

India vs England : టీమిండియాకు బిగ్‌ షాక్ ఇచ్చిన అశ్విన్‌.. అర్ధాంతరంగా టెస్ట్‌ మ్యాచ్‌ నుంచి నిష్క్రమణ.!

రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో అశ్విన్‌ శుక్రవారం ఒక వికెట్‌ తీసి 500 వికెట్ల క్లబ్‌లో చేశారు. భారత్‌ టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు..

by Venu

భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) టీమిండియాకు బిగ్‌షాక్‌ ఇచ్చారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ నుంచి కీలక బౌలర్ అశ్విన్ వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ (X) ద్వారా తెలిపింది. కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ (Medical Emergency) కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు బోర్డ్ తెలిపింది. ఈ సమయంలో బీసీసీఐ (BCCI) మరియు ఇండియా (India) జట్టు పూర్తిగా అశ్విన్‌కు మద్దతు ఇస్తుందని పేర్కొంది.

మరోవైపు అనారోగ్యంతో అశ్విన్ తల్లి బాధపడుతున్నట్లు సమాచారం. ఈ కారణంతో మ్యాచ్‌ నుంచి దూరమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ట్వీట్ చేశారు. ఈ పరిస్థితుల్లో తన తల్లికి దగ్గర ఉండడం కోసం అశ్విన్‌, రాజ్‌కోట్‌ (Rajkot)నుంచి చెన్నై వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఈ కష్టకాలంలో అశ్విన్‌కు అవసరమైన సహాయాన్ని బోర్డు, టీమ్‌ఇండియా జట్టు అందిస్తుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో అశ్విన్‌ శుక్రవారం ఒక వికెట్‌ తీసి 500 వికెట్ల క్లబ్‌లో చేశారు. భారత్‌ టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు.. మూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ 37 పరుగులు చేశాడు. ఇక రాజ్‌కోట్ టెస్టులో మూడు రోజుల ఆట ఉండగా.. కేవలం పది మంది ఆటగాళ్లు మాత్రమే భారత్‌కు మిగిలారు. అశ్విన్ వైదొలగడంతో టీమిండియాకు రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్‌ ఫ్రంట్‌లైన్ స్పిన్నర్లుగా మిగిలారు.

ఇక భారత్‌ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండోరోజు బ్యాటింగ్‌ లోకి దిగిన ఇంగ్లాండ్‌ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెన్‌ డకెట్‌ (133 రన్స్) .. జో రూట్ (9 రన్స్) క్రీజులో ఉన్నారు. కాగా బౌలర్లు పుంజుకొని ప్రత్యర్థి జట్టును తొందరగా ఆలౌట్‌ చేస్తేనే భారత్‌ మ్యాచ్‌పై పట్టుబిగిస్తుంది. భారత బౌలర్లలో సిరాజ్‌, అశ్విన్‌ ఒక్కొక్క వికెట్‌ తీశారు. మరోవైపు టీమిండియా నలుగురు బౌలర్లతో మ్యాచ్ ఆడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టుకు కీలకంగా ఉన్న అశ్విన్‌ దూరం కావడం ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.

You may also like

Leave a Comment