Telugu News » Jaishankar: కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ..!

Jaishankar: కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ..!

భారత విదేశాంగ మంత్రి జై శంకర్(Jai Shankar) కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ(Melanie Jolie)తో భేటీ అయ్యారు. భారత్, కెనడాల మధ్య ధౌత్య సంబంధాలపై చర్చించినట్లు సమాచారం.

by Mano
Jaishankar: Jaishankar met with Canadian Foreign Minister..!

భారత విదేశాంగ మంత్రి జై శంకర్(Jai Shankar) కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ(Melanie Jolie)తో భేటీ అయ్యారు. జర్మనీ(Germany)లో జరుగుతోన్న మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్సు(Munich Security Conference)లో భాగంగా వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్, కెనడాల మధ్య ధౌత్య సంబంధాలపై చర్చించినట్లు సమాచారం.

Jaishankar: Jaishankar met with Canadian Foreign Minister..!

జర్మన్ కౌంటర్ అన్నాలెనా బేర్‌బాక్‌, అర్జెంటీనా కౌంటర్ డయానా మొండినోతోనూ జైశంకర్ సమావేశమయ్యారు. అదేవిధంగా ప్రపంచ పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీపై జైశంకర్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘‘కెనడియన్ కౌంటర్ మెలానీతో భేటీ కావడం సంతోషకరం. ఈ సమావేశంలో ఇరు దేశాల సంబంధాలు, ప్రపంచ పరిస్థితులపై చర్చించాం’’ అని పేర్కొన్నారు.

గతేడాది ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపణలు చేయడంతో భారత్-కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏటా జర్మనీలో మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తారు.

ఈ వేదికపై అంతర్జాతీయ భద్రతా విధానాలపై చర్చిస్తారు. ఇది 1963లో ప్రారంభం కాగా ప్రస్తుతం నిర్వహిస్తున్న సమావేశం 60వది. ఈ నెల 18వరకు ఈ కాన్ఫరెన్స్ జరగనుంది. అమెరికాలోని జర్మన్ రాయబారి క్రిస్టోఫ్ హ్యూస్జెన్ అధ్యక్షతన ఈ ఏడాది సదస్సు జరుగుతోంది. సుమారు 70కి పైగా దేశాలు, 350కి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు.

You may also like

Leave a Comment