స్పోర్ట్ (Sport) ఈ పేరు వింటే క్రీడాకారుల హృదయాలు తప్పక స్పందిస్తాయి. గెలుపే ప్రధాన లక్ష్యంగా వీరి పోరాటం సాగుతోంది. ఆట ఏదైనా క్రీడాకారుల లక్ష్యం ఒక్కటే.. ఒక్క సారి అయినా ఛాంపియన్ (Champion) అనిపించుకోవాలని. లబ్ డబ్ అని కొట్టుకునే గుండె కూడా గెలుపు శబ్ధాలు చేయడం క్రీడాకారులకు సృష్టంగా వినిపిస్తోంది.
కాగా మన దేశ క్రీడాకారులు వారి వారి కేటగిరీల్లో విజయాలు అందుకొని స్వదేశానికి తిరిగి వచ్చారు. నిన్న, మొన్నటి వరకు అథ్లెట్లు పతకాల పంట పండించగా, తాజాగా తమ వంతు అన్నట్లు ఆర్చర్లు రెచ్చిపోయారు. చైనా (China)లో హాంగ్జౌ లో జరిగిన 19th ఏషియన్ గేమ్స్ (Asian Games) ఆర్చరీ పోటీలలో తెలుగమ్మాయి వెన్నెం జ్యోతిసురేఖ, అదితి స్వామి, పర్నీత్‌కౌర్ త్రయం స్వర్ణం ఖాతాలో వేసుకోగా, అభిషేక్‌వర్మ, ఒజాస్, ప్రతమేశ్ పసిడి ముద్దాడారు.
స్కాష్‌లో మన ప్లేయర్లు స్వర్ణ, రజతాలు దక్కించుకోగా, పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన ప్రణయ్ సంచలనం సృష్టించాడు. రెండుసార్లు ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత కోనేరు హంపీ తన రెండవ రౌండ్ మహిళల వ్యక్తిగత చెస్ గేమ్‌లో వియత్నాంకు చెందిన లే థావో న్గుయెన్‌పై గెలిచి సిల్వర్ మెడల్ సాధించింది. గ్రాండ్‌మాస్టర్ హారిక ద్రోణవల్లి కూడా తన రెండు మహిళల వ్యక్తిగత చెస్ గేమ్‌లలో 2.0 పాయింట్లు సాధించి విజయం సాధించింది.మొత్తానికి భారత్ ఈ సంవత్సరం పతకాల వేట కొనసాగించింది.