బిస్కెట్ బంగారం, చాక్లెట్ బంగారం,షూ బంగారం,సాక్స్ బంగారం, బెల్ట్ బంగారం.. ఒకటేంటి..! మన గోల్డ్ స్మగ్లర్స్ అన్ని టెక్నిక్స్ ట్రైచేశారు. అయితే రీసెంట్ గా ఓ జంట వాడిన టెక్నిక్ ని చూసి కస్టమ్స్ వాళ్లు ఖంగుతిన్నారు, విషయం తెలిస్తే స్మగ్లర్స్(Smugglers) కూడా షాక్ అవుతారు.
ఇంతకీ సింగపూర్ నుంచి భారత్ కు బంగారం తరలించడానికి ఆ దంపతులు వేసిన ప్లాన్ ఏంటంటారా..!? వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన ఓ జంట రూ.1.05 కోట్ల విలువైన రెండు కిలోల బరువున్న(24 క్యారట్స్) బంగారం పొడితో ఇండిగో విమానం(Indigo flight)లో సింగపూర్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టు(Mumbai Airport)కు చేరుకున్నారు.
ఈ రెండు కిలోల బంగారాన్ని దంపతులిద్దరి లోదుస్తుల్లో కొంత, వారి మూడేళ్ల పాప డైపర్‌లో కొంత దాచుకుని వచ్చారు.అక్కడి నుంచి నేరుగా చైన్నై(Chennai)కి ఆ బంగారం పొడిని తరలించాలనేది ఆ బంగారు దంపతుల ప్లాన్.
అయితే, ఆ ప్లాన్ బెడిసికొట్టింది. ముంబై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి, వారి పసిబిడ్డ నుంచి బంగారం పొడిని సీజ్ చేశారు. నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి ముంబై పోలీసులకు అప్పగించారు.