Telugu News » Betting App Scam: బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో నటుడు అరెస్ట్..!

Betting App Scam: బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో నటుడు అరెస్ట్..!

సైబర్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను ఛత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు రూ.15వేల కోట్ల అవినీతి జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు సంస్థ గుర్తించింది.

by Mano
Betting App Scam: Actor arrested in betting app scam case..!

మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసు(Mahadev Betting App Scam Case)లో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ట్రైనర్‌ సాహిల్ ఖాన్‌(Sahil Khan)ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను ఛత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు రూ.15వేల కోట్ల అవినీతి జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు సంస్థ గుర్తించింది.

Betting App Scam: Actor arrested in betting app scam case..!

దాదాపు 67 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్స్‌ను సృష్టించి క్రికెట్, ఫుట్‌బాల్, తీన్ పత్తీ లాంటి గేమ్స్ లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులోకి సామాన్యులను ఆకర్షించేందుకు సెలబ్రిటీలతో ప్రమోట్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గతేడాది నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్‌లో సాహిల్ ఖాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

అయితే తనను అరెస్టు చేయకుండా సాహిల్ ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలో సాహిల్‌కు సిట్ 2023 డిసెంబరులోనే నోటీసులు జారీకాగా ఆయన విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొడుతూ వచ్చారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. ఒక సెలెబ్రిటీగా తాను కేవలం 2022లో ఆ యాప్‌నకు బ్రాండ్ ప్రమోటర్‌గా మాత్రమే పని చేశానంటూ వెల్లడించారు.

యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే పోలీసులు మాత్రం ఆ బెట్టింగ్ యాప్ సహ యజమాని సాహిల్ ఖాన్‌ అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు కోర్టు ఆయనకు బెయిల్‌ను నిరాకరించింది. బెట్టింగ్ యాప్ కార్యకలాపాలన్నీ అక్రమమని స్పష్టం చేసింది. నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించి ఫేక్ సిమ్ కార్డులతో సంప్రదింపులు చేసినట్లు గుర్తించారని, ‘ది లయన్ బుక్ 247’తో నేరుగా సంబంధం ఉన్నట్లు తేలిందని ధర్మాసనం చెప్పింది.

You may also like

Leave a Comment