Telugu News » Salman Khan: సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసులో కీలక పరిణామం..!

Salman Khan: సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసులో కీలక పరిణామం..!

ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు బెయిల్ రావడం కష్టంగా మారుతుంది. అదేవిధంగా వారి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అన్మోల్ బిష్ణోయ్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు.

by Mano
Salman Khan: A key development in the shooting case at Salman's house..!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి బయట కాల్పుల ఘటనలో కీలక పరిమాణం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో ముంబై పోలీసులు ఎంసీవోసీఏ(MCOCA) చట్టాన్ని విధించారు. దీంతో పాటు ఇప్పుడు ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు బెయిల్ రావడం కష్టంగా మారుతుంది. అదేవిధంగా వారి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అన్మోల్ బిష్ణోయ్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Salman Khan: A key development in the shooting case at Salman's house..!

ఈ కేసులో అరెస్టయిన నిందితులు డీసీపీ ర్యాంక్ అధికారి ఎదుట పోలీసుల విచారణలో ఇచ్చిన వాంగ్మూలాన్ని ఇప్పుడు మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంగా పరిగణించనున్నారు. ఎంసీవోసీఏ ప్రకారం దీనిని కోర్టులో సాక్ష్యంగా సమర్పించవచ్చు. జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్, విదేశాల్లో ఉన్న అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను వాంటెడ్‌గా ప్రకటించారు. అతడు పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్ ఐపీ అడ్రస్‌ ఆధారంగా పోర్చుగల్‌లో ఉన్నట్లు గుర్తించారు.

ఇప్పటికే అన్మోల్ బిష్ణోయ్‌పై లుక్ ఔట్ నోటీసు జారీ చేయగా ఇప్పుడు ఎంసీవోసీఏ విధింపుతో ఈ కేసు కఠినతరంగా మారింది. ఏప్రిల్ 14, ఆదివారం ఉదయం సల్మాన్ ఖాన్ నివాసముంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో కాల్పులు జరిపిన నిందితులు షూటర్లు సాగర్ పాల్, విక్కీ గుప్తా ఏప్రిల్ 29 వరకు పోలీసు కస్టడీలో ఉన్నారు. కోర్టు వారికి గతంలో 10 రోజుల రిమాండ్ విధించగా నాలుగు రోజులు పొడిగించింది.

ఇప్పుడు ఎంసీవోసీఏ విధింపుతో నిందితులను 30రోజులు కస్టడీకి తీసుకునే అవకాశముంది. అంతేకాదు.. కోర్టు అనుమతితో 90రోజులకు బదులుగా 180 రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో నిందితులకు కనీసం 6 నెలల వరకు సులభంగా బెయిల్ లభించదని చెబుతున్నారు. ఇక ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్టు చేసింది.

You may also like

Leave a Comment