స్పెయిన్‌లో టోర్నమెంట్‌కు ఆడేందుకు వెళ్లిన భారత చెస్ ఆటగాళ్లకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు(Grand Masters) బస చేసిన గదుల్లోకి దొంగలు చొరబడ్డారు. చెస్ ఆటగాళ్ల ల్యాప్‌టాప్(Laptop), పాస్‌పోర్టు (PassPort)లతో పాటు డబ్బులు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.
రూమ్‌కి వచ్చి చూసే సరికి విలువైన వస్తువులేవీ లేకపోవడంతో భారత గ్రాండ్‌మాస్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయాన్ని భారత చెస్ గ్రాండ్ మాస్టర్ దుష్యంత్ శర్మ(Dushyant Sharma) సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నాడు.
సన్వే సిట్జెస్ చెస్ టోర్నమెంట్ ఆడేందుకు 70 మందితో కూడిన చెస్ బృందం స్పెయిన్‌కు వెళ్లింది. టోర్నీ జరిగే ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణంలోని అపార్ట్మెంట్లలో భారత ఆటగాళ్లకు నిర్వాహకులు బస ఏర్పాటు చేశారు. అయితే.. గ్రాండ్‌మాస్టర్లు దుష్యంత్ శర్మ, సంకల్ప్ గుప్తా, మహిళల గ్రాండ్ మాస్టర్ శ్రీజ శేషాద్రి, అర్పిత ముఖర్జీ, విశ్వ షా, మౌనికా అక్షయలు ఉంటున్న గదుల్లో దొంగలు బీభత్సం సృష్టించారు.
ఎవరూ లేని సమయంలో భారత ఆటగాళ్లు బస చేసిన గదులు తలుపులు పగులగొట్టిన దొంగలు ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో పాటు డబ్బులతో ఉడాయించారు. అక్కడ పోలీసులను ఆశ్రయించగా వాళ్లు తాము ఏం చేయలేమంటూ వెనక్కి పంపేశారు. దాంతో చేసేది లేక చెస్ గ్రాండ్ మాస్టర్లు అచేతన స్థితిలో ఉన్నారు.