Telugu News » Indian Railway: ఐదేళ్లలో అందుబాటులోకి మరో 3వేల కొత్త రైళ్లు: రైల్వే మంత్రి వైష్ణవ్

Indian Railway: ఐదేళ్లలో అందుబాటులోకి మరో 3వేల కొత్త రైళ్లు: రైల్వే మంత్రి వైష్ణవ్

కొత్త రైళ్లను తీసుకురావడమే కాకుండా రైల్వే వ్యవస్థను పటిష్ఠం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. మరో ఐదేళ్లలో మరో 3వేల కొత్త రైళ్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు.

by Mano
Indian Railway: Another 3 thousand new trains to be made available in five years: Railway Minister Vaishnav

కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వే(Indian Railway) వ్యవస్థలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) కీలక విషయాన్ని వెల్లడించారు.

 

RAILWAY

కొత్త రైళ్లను తీసుకురావడమే కాకుండా రైల్వే వ్యవస్థను పటిష్ఠం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. మరో ఐదేళ్లలో మరో 3వేల కొత్త రైళ్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. రానున్న ఐదేళ్లలో భారత రైల్వే రంగం మరింత అభివృద్ధి కానుందని తెలిపారు. ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రైల్వే ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. దానికి తగ్గట్టుగానే వసతులు కల్పిస్తామని వెల్లడించారు.

ప్రస్తుతం రైల్వేవద్ద 69,000 కొత్త కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఏటా సుమారు 5,000 కోచ్‌లు అదనంగా తీసుకువచ్చి ప్రతి ఏడాది 200-250 కొత్త రైళ్లను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. రానున్న ఐదేళ్లలో మూడు వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.

ప్రస్తుతం ఏటా రైళ్లలో 800 కోట్ల మంది ప్రయాణిస్తుండగా.. ఆ సామర్థ్యాన్ని వేయి కోట్లకు పెంచడంపై ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. అన్ని రైలు బోగీల్లో పుష్‌-పుల్‌ విధానాన్ని ప్రవేశపెట్టి, ప్రయాణ సమయం తగ్గేలా చూస్తామని కేంద్ర మంత్రి వైష్ణవ్ చెప్పారు. స్లీపర్‌ బోగీలను తగ్గించి, ఏసీ కోచ్‌లను పెంచుతున్నామన్న వాదనను మంత్రి తోసిపుచ్చారు.

You may also like

Leave a Comment