ఇంగ్లండ్‌పై చారిత్రక టెస్ట్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత మహిళా క్రికెట్ జట్టు(INDW) మరో సంచలనం సృష్టించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం(Wankhede Stadium)లో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా(AUSW)పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోరోజు ఆట మిగిలి ఉండగానే విజయకేతనం ఎగురవేసింది.
భారత మహిళలకు ఆస్ట్రేలియా జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం. భారత్‌తో ఏకైక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. డిసెంబరు 21న మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై చెలరేగిన భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 219 పరుగులకే ఆలౌట్ చేశారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 233 పరుగులు సాధించిన ఆసీస్.. నాలుగో రోజు మరో 28 పరుగులు చేసి 261 పరుగులకు ఆలౌట్ అయింది. స్నేహ్ రాణా 4 వికెట్లు పడగొట్టగా.. రాజేశ్వరి గైక్వాడ్, హర్మన్ ప్రీత్ కౌర్ రెండేసి వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆటలోనే మ్యాచ్‌ను ముగించేసింది. స్మృతి మంధాన (38) సునాయాస విజయాన్ని అందించింది.
తహ్లియా మెక్త్ (50) టాప్ స్కోరర్. పూజా వస్త్రాకర్ 4, స్నేహ్ రాణా 3, దీప్తి శర్మ 2 చొప్పున వికెట్లు తీశారు. ఆపై భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు ఆలౌట్ అయి భారీ ఆధిక్యంలో నిలిచింది. స్మృతి మంధాన (74), జెమీమా రోడ్రిగ్స్ (73), రిచా ఘోష్ (52), దీప్తి శర్మ (78) హాఫ్ సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్ తిరిగి పుంజుకోవాలని చూసిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు షాక్ ఇచ్చారు.