ఇండోనేషియా(Indonesia)లో వరుస భూకంపాలు (Earthquakes) అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. గత వారం జపాన్‌లో 7.6తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది.
భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 నిమిషాలకు భూమి కంపించింది. భూకంప కేంద్రాన్ని 80కి.మీ లోతులో గుర్తించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది.
అయితే, ఈ భూకంపం ద్వారా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. గతవారం రిక్టర్ స్కేల్‌పై 7.6తీవ్రతతో భూమి కంపించగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఎనిమిదేళ్లలో జపాన్‌లో సంభవించిన ఘోరమైన భూకంపమని అధికారులు పేర్కొన్నారు.
ఈ భూకంప ధాటికి దాదాపుగా 100మంది మృతిచెందారు. 200 మందికి పైగా ప్రజల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. హోకురికు ప్రాంతంలో 23వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జపాన్ పశ్చిమ తీరంలో వచ్చిన ఈ భూకంపం మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది.