Telugu News » సుధ & నారాయణ మూర్తిల లవ్ స్టోరీ గురించి తెలుసా? చివరకు పెళ్లి ఖర్చులు కూడా?

సుధ & నారాయణ మూర్తిల లవ్ స్టోరీ గురించి తెలుసా? చివరకు పెళ్లి ఖర్చులు కూడా?

సుధ & నారాయణ మూర్తిల లవ్ స్టోరీ ఈ విషయాలు గురించి తెలుసా?

by Sri Lakshmi

సుధా మూర్తి మరియు నారాయణ మూర్తి ప్రేమకథ చాలా జంటలకు ప్రేరణ. నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ యొక్క ప్రముఖ సహ వ్యవస్థాపకుడు మరియు పదవీ విరమణ చేయడానికి ముందు కంపెనీ ఛైర్మన్‌గా ఉన్నారు. అతను ఇంగ్లీష్ మరియు కన్నడ భాషలలో ప్రముఖ రచయిత్రి సుధా మూర్తిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కి రిటైర్డ్ చైర్‌పర్సన్, టెల్కోలో నియమించబడిన మొదటి మహిళా ఇంజనీర్ మరియు సామాజిక కార్యకర్త.

వారిద్దరూ నాలుగు సంవత్సరాలు డేటింగ్ చేసి ఫిబ్రవరి 10, 1978న వివాహం చేసుకున్నారు. వారి ప్రొఫెషనల్ లైఫ్ గురించి అందరికి తెలుసు. కానీ, వారి లవ్ స్టోరీ చాలా తక్కువ మందికి తెలుసు. సుధ గారికి నారాయణ మూర్తి పరిచయం అయ్యే సమయానికి నారాయణ మూర్తికి ఉద్యోగం లేదు. ఆయన రీసెర్చ్ అసిస్టెంట్ గా పని చేసేవారట. సుధ గారు టెల్కో లో పని చేసేవారట. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ముందు నారాయణ మూర్తి గారే సుధ గారికి ప్రపోజ్ చేశారట. నేనో మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మీరు కోరుకునే సంపదలను నేను ఇవ్వలేను. మీరంటే అభిమానం ఉంది. మీరు తెలివైన, అందమైన వ్యక్తి. నన్ను పెళ్లి చేసుకుంటారా? అంటూ నారాయణ మూర్తి సుధగారిని అడిగారట.

అయితే.. రీసెర్చ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న నారాయణ మూర్తి గారికి ఇచ్చి పెళ్లి చేయడానికి సుధ గారి తండ్రి ఒప్పుకోలేదు. చివరకు ఆయన ప్యాట్నీ కంప్యూటర్స్ లో జనరల్ మేనేజర్ గా చేస్తే తప్ప ఈ పెళ్లి జరగలేదు. పెళ్లి తరువాతే సుధ గారి సహాయం తోనే నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ ను ఫౌండేషన్ ను స్థాపించారట. అయితే.. దీని కోసం సుధ మూర్తి గారు పదివేల రూపాయల సహాయాన్ని చేశారట. వీరు పెళ్లిని చాలా సింపుల్ గా చేసుకున్నారు. పెళ్లి ఖర్చులను కూడా పంచుకున్నారు. ఇద్దరు చెరొక నాలుగొందల రూపాయలను ఖర్చు చేసుకుని.. మొత్తం ఎనిమిది వందల రూపాయలతో పెళ్లి చేసుకున్నారట. కానీ.. వీరి బంధం ఎంత దృడంగా ఉందొ మనం చూస్తూనే ఉన్నాం.

You may also like

Leave a Comment