Telugu News » శ్రీమంతుడు స్టోరీ కాపీనా? హృతిక్ రోషన్ కు నోటీసులు? అసలేం జరిగిందంటే?

శ్రీమంతుడు స్టోరీ కాపీనా? హృతిక్ రోషన్ కు నోటీసులు? అసలేం జరిగిందంటే?

శ్రీమంతుడు కథ చోరీ.. హృతిక్ రోషన్ కు నోటీసులు?

by Sri Lakshmi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే.. ఈ సినిమా స్టోరీ నా సొంతం అంటూ గతేడాది ఫిబ్రవరిలో శరత్ చంద్ర అలియాస్ ఆర్డీ విల్సన్ కేసు వేసిన సంగతి తెలిసిందే. స్వాతి దినపత్రికలో “సచ్చేంత ప్రేమ’ అనే కథనే తీసుకొచ్చి శ్రీమంతుడు సినిమా తెరకెక్కించారు అంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా ఆయన ఈ విషయమై మహేష్ బాబుకు చెందిన ఎంబి క్రియేషన్స్, డైరెక్టర్ కొరటాల శివ కు సమన్లు పంపాలి అంటూ శరత్ చంద్ర కోరారు.

శరత్ చంద్ర ఫిర్యాదు చేసిన వ్యక్తులకు వ్యక్తిగతంగా నోటీసులు పంపించాలి అంటూ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టులో ఈ విషయమై విచారణ జరిగింది కూడా. నాంపల్లి, హైకోర్టు కొరటాల శివపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసాయి. ఈ కేసు విషయమై ఇంకా హైదరాబాద్ లో విచారణ జరుగుతుండగానే.. ఇదే సినిమాను హృతిక్ రోషన్ తో రీమేక్ చేస్తున్నారు అన్న వార్తలు వచ్చాయి.

దానితో.. ఈ ప్రయత్నాలను ఆపాలన్న ఉద్దేశ్యంతో ఉన్న శరత్ చంద్ర మరొక సారి కోర్టుని ఆశ్రయించారు. కాపీ రైట్స్ చట్ట ఉల్లంఘనలను డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాత ఎర్నేవి నవీన్ పట్టించుకోవడం లేదని శరత్ చంద్ర ఫిర్యాదు చేసారు. బాలీవుడ్ రీమేక్ పై కూడా శరత్ చంద్ర కేసు దాఖలు చేసారు. ఈ పిటిషన్ ను విచారించిన హై కోర్ట్ ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేయకుండా ఉండడం కోసం, నిర్మాతకు, హృతిక్ రోషన్ కు సమన్లు పంపించింది. శ్రీమంతుడు కథ చోరీ కేసులో కోర్టు శరత్ చంద్రకు అనుకూలంగా తీర్పుని ఇచ్చింది. అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ కొరటాల తరపు న్యాయవాది సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీమ్ దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండాలని సూచించడంతో కొరటాల తరపు న్యాయవాది ఈ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు.

You may also like

Leave a Comment