Telugu News » సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కుమారి ఆంటీ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కుమారి ఆంటీ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుమారి ఆంటీ ఎవరు? ఆమె సక్సెస్ స్టోరీ ఏంటి?

by Sri Lakshmi
sucess

ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా అకౌంట్లు వాడే వారికి కుమారి సక్సెస్ స్టోరీ గురించి తెలిసే ఉంటుంది. ఆమె ఓ స్ట్రీట్ వెండర్. రోడ్ సైడ్ చిన్న సైజు హోటల్ లో రకరకాల వంటలను సరసమైన ధరలలో అందించే ఆమె స్టోరీ అందరికి ఇన్స్పైరింగ్ గా ఉంటోంది. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కేబుల్ బ్రిడ్జి దగ్గర్లో ఐటీసీ కోహినూరు హోటల్ రోడ్డు వద్ద కుమారి ఫుడ్ పాయింట్ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆవిడ హోటల్ చాలా ఫేమస్. సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అయ్యారు. మీమర్స్ ఇన్వొల్వెమెంట్ వలన ఆమె మరింత పాపులర్ అయ్యారు.

అయితే.. రేట్స్ కొంచం ఎక్కువ ఉన్నాయి అంటూ కొంత నెగటివ్ ట్రోలింగ్ కూడా వచ్చింది. అయితే.. ఈమె సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. హైదరాబాద్ లో ఉండే అందరికి ఐటీసీ కోహినూరు హోటల్ రోడ్డు వద్ద ఉండే ఫుడ్ స్ట్రీట్ గురించి తెలుసు. మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా కుమారి గారు అక్కడకి వచ్చేస్తారు. ఆ స్ట్రీట్ లో కుమారి ఫుడ్ చాలా ఫేమస్. ఆమె వద్ద వెజ్, నాన్ వెజ్ రెండు రకాల ఫుడ్స్ ఉంటాయి. అయితే.. వెజ్ కంటే.. నాన్ వెజ్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

మధ్యాహ్నం రెండు గంటలు అయ్యేసరికి ఆమె వద్ద ఉండే సగానికి సగం నాన్ వెజ్ ఐటెమ్స్ అయిపోతాయి. ఆమె వంట అంతా ఇంట్లోనే సిద్ధం చేసుకుని పన్నెండు గంటల కల్లా వచ్చేస్తుంటారు. వంట లోకి కావలసిన మసాలా దినుసులు అన్నీ ఆమె స్వయంగా ఇంట్లోనే చేసుకుంటారు. ఇంట్లో వాళ్లంతా కలిసి తలో చెయ్యి వేసుకుని వంట పూర్తి చేస్తారు. అందుకే వారి వంటకి అంత డిమాండ్. ఈమె గురించి వీడియో చేస్తున్న ఒక ఆమె ఓ కస్టమర్ కొనుగోలు బిల్ గురించి చెప్తూ.. అతనికి వెయ్యి రూపాయలు బిల్ అయ్యిందని తెలిపింది. అతడిని పిలిచి అడగ్గా.. అతని బిల్ అమౌంట్ చెప్తూ.. 2 లివర్స్ ఎక్స్ ట్రా అని తెలిపాడు. దీనితో ఈ వీడియోను పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసారు. ఈ ట్రోలింగ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. మార్కెట్ లో రేట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఒక గుడ్డే ఏడూ రూపాయలు పలుకుతోంది. ఇక అల్లం, వెల్లుల్లి.. ఇలా అన్ని పదార్ధాల ఖరీదు ఎక్కువగానే ఉంది. గతంలో స్ట్రీట్ వెండర్స్ తక్కువ ధరకే అమ్మేవారు. కానీ ఇప్పుడు వీరు కూడా శుచి, శుభ్రత ఎక్కువగా పాటిస్తూ ధరని కూడా అదే స్థాయిలో అడుగుతున్నారు. ఇన్ని విషయాలను ఆలోచించి ఓ మహిళా ఇటువంటి ధరలు ఉన్న సమాజంలో కుటుంబం సాయంతో సొంతంగా ఇటువంటి హోటల్ నడుపుతోంది అంటే ఆమెని నిజంగా మెచ్చుకోవచ్చు.

You may also like

Leave a Comment