దుబాయ్(Dubai) వేదికగా మంగళవారం రాత్రి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2024) సీజన్‌కు మినీ వేలాన్ని(Mini Auction) నిర్వహించారు. ఈ వేలంలో కొందరు స్టార్ ప్లేయర్లపై కాసుల వర్షం కురిసింది. ఇందులో ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నక్క తోక తొక్కాడనే చెప్పాలి. ఈ ప్లేయర్ రికార్డు స్థాయి ధర పలికాడు.
మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఏకంగా రూ.24.75 కోట్లకు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్‌ను రూ.20.50కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లపై కోట్ల వర్షం కురవగా.. మరికొందరు స్టార్ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది.
మరోవైపు ఎస్ఆర్‌హెచ్ మాజీ హెడ్ కోచ్ టామ్ మూడీ చెప్పిన జోస్యం నిజమైనట్లైంది. ఆయన చెప్పినట్లుగానే ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అనోసోల్డ్‌గా మిగిలాడు. రూ.2 కోట్ల వచ్చిన స్మిత్‌ను కొనేందుకు ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ఆదిల్ రషీద్, సీన్ అబాట్, జోష్ హేజిల్ వుడ్, జోష్ ఇంగ్లిస్, బెన్ డకెట్, జేమ్స్ నీషమ్, జేసన్ హోల్డర్, టిమ్ సౌథీ లాంటి స్టార్ ప్లేయర్లపై ఎవరూ ఆసక్తి చూపలేదు.
కనీస ధర రూ.2కోట్లు ఉన్నప్పటికీ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్‌తో పాటు మరికొంతమంది ప్లేయర్లు ఉన్నారు. వాండర్ డసెన్, జేమీ ఓవర్టన్, జోష్ ఇంగ్లిస్, బెన్ డకెట్, సీన్ అబాట్, జేమ్స్ విన్స్, జోష్ హేజిల్ వుడ్, ఆదిల్ రషీద్ ఈ జాబితాలో చేరారు.
అదేవిధంగా కనీస ధర రూ.1.50కోట్లు ఉన్న ప్లేయర్లు కొందరికి ఐపీఎల్ వేలంలో నిరాశే మిగిలింది. ఈ జాబితాలో కొలీన్ మున్రో, టిమ్ సౌథీ, జేసన్ హోల్డర్, క్రిస్ జోర్డాన్, జేమ్స్ నీషమ్, టైమల్ మిల్స్, డానియల్ సామ్స్, ఫిలిప్ సాల్ట్ ఉన్నారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన వేలంలో ప్లేయర్లతో పాటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వేలంలో చోటు దక్కని ప్లేయర్ల ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.