చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఐపీఎల్-2024(IPL-2024) సీజన్‌కు ముందు ఈ జట్టులోని ప్లేయర్లకు గాయాల బెడద తప్పడంలేదు. ఇప్పటికే స్టార్ ఆల్ రౌండర్లు డార్లీ మిచెల్, శివమ్ దుబే గాయాలతో ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.
తాజాగా మరో న్యూజిలాండ్ స్టార్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర గాయపడ్డారు. ఆస్ట్రేలియాతో తొలి టీ20 సందర్భంగా రచీన్ రవీంద్ర ఎడమ కాలికి గాయం కావడంతో అతడు రెండో టీ20కు దూరమయ్యాడు. అయితే, రెండో టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే సైతం గాయపడ్డాడు. కీపింగ్ చేస్తుండగా బంతిని అందుకునే క్రమంలో ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది.
దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. స్కానింగ్‌లో ఫ్రాక్చర్ అయినట్లు తేలగా మూడో టీ20కి దూరమయ్యాడు. కాన్వే స్థానంలో టీమ్ సీఫర్ట్‌కు జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్ ఆరంభ సమయానికి డెవాన్ కాన్వే పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అతడితో పాటు డార్లీ మిచెల్, రవీంద్ర పూర్తిగా కోలుకోనున్నట్లు పలు నివేదికలు తెలిపాయి. ఈ ఏడాది ధానాదన్ లీగ్ మార్చి 22నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.