Telugu News » Rajath Kumar : డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కు రజత్ కుమార్ లేఖ…..!

Rajath Kumar : డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కు రజత్ కుమార్ లేఖ…..!

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ (Rajathi Kumar) లేఖ రాశారు.

by Ramu

మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై సెంట్రల్ టీమ్ ఇచ్చిన నివేదికలోని అంశాలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ (Rajathi Kumar) లేఖ రాశారు. బ్యారేజీకి సంబంధించిన అంశాలతో పాటు నివేదికలో పేర్కొన్న అంశాలకు సంబంధించి లేఖలో ఆయన వివరణ ఇచ్చారు.

సిమెంట్ కాంక్రీట్ ఫౌండేషన్, రాఫ్ట్‌లో లోపాల, నాణ్యత లేమి వల్లే బ్యారేజీ పిల్లర్లు కుంగి పోయాయని, పగుళ్లు ఏర్పడ్డాయని అథారిటీ వ్యాఖ్యలు వాస్తవం కాదని రజత్ కుమార్ వెల్లడించారు. బ్యారేజీని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల ప్రకారమే నిర్మించామని తెలిపారు. ఇప్పుడు ఫౌండేషన్ ఇంకా నీటిలోనే ఉన్నదని వివరించారు.

కాపర్ డ్యామ్ కట్టి, ఆ తర్వాత నీటిని తోడి పూర్తిగా అధ్యయనం చేస్తే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాంటి అధ్యయనం చేయకుండా ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని స్పష్టం చేశారు. ఈ కారణంగా నివేదికలో వెల్లడించిన నాలుగు కారణాలతో తాము ఏకీభవించబోమని లేఖలో తేల్చి చెప్పారు.

మరోవైపు పిల్లర్లకు అనుసంధానంగా ఉండే సీకెంట్ పైల్స్ విషయంలోనూ కేంద్ర జల సంఘం సూచించిన ప్రోటోటైప్ విధానాన్ని తాము అనుసరించామన్నారు. కేంద్ర బృందం కోరిన అన్ని పత్రాలను తాము సమర్పించామన్నారు. కొన్నింటినీ సమీక్షా సమావేశంలోనూ, మరికొన్నింటినీ మెయిల్ ద్వారా పంపామన్నారు. సెలవులు రావడంతో నిర్దేశించిన సమయంలో వాటిని సమర్పించలేకపోయామన్నారు.

ఈ ఏడాది జూలై 12న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను డ్యామ్ రక్షణ చట్ట పరిధిలోకి తీసుకు వచ్చామన్నారు. ఆ కారణం వల్లే జూలైలో చేపట్టాల్సిన తనిఖీలను అప్పుడు చేపట్టలేకపోయామన్నారు. కానీ ఆ తర్వాత వర్షాకాల అనంతర తనిఖీలను నవంబర్ చివరి వారంలో నిర్వహించామని పేర్కొన్నారు. సుందిళ్ళ బ్యారేజీలను కేంద్ర బృందం పరిశీలించలేదన్నారు.

అలా పరిశీలనలు చేయకుండానే ఆయా బ్యారేజీలపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కానీ డ్యామ్ సేఫ్టీ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్‌లోని పిల్లర్లకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ టీమ్ తన నివేదికలో పేర్కొన్న 9, 10, 11 అంశాలను తాము పరిగణనలోకి తీసుకున్నామని, అవన్నీ తమ దృష్టిలో ఉన్నాయని రజత్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

డ్యామ్ సేఫ్టీ చట్టం 2021 డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. కానీ అంత కన్నా ముందే 2019లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందన్నారు. అందువల్ల చట్టంలోని పలు అంశాలను అమలు చేయడంలో ఆలస్యమవుతోందని వివరణ ఇచ్చారు. చట్టాన్ని అమలు చేసే క్రమంలో అనేక సందేహాలు నెలకొన్నాయన్నారు. దీంతో అథారిటీతో సంప్రదింపులు కూడా జరిపామన్నారు. చివరకు ఈ ఏడాది మార్చి 15న వర్చువల్ గా సమావేశం కూడా అయ్యామన్నారు.

ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్‌‌ పిల్లర్లకు నష్టం జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ టీమ్ తన నివేదికలో పేర్కొన్న 9, 10, 11 అంశాలను తాము పరిగణనలోకి తీసుకున్నామన్నారు. కొన్ని పిల్లర్లకు డ్యామేజీ జరిగిందని, కానీ అనుకున్న తీరులో బ్యారేజీ పని చేయాలంటే మొత్తం బ్లాక్‌నే పునర్ నిర్మించాల్సి వస్తుందన్న అథారిటీ నివేదికతో తాముే ఏకీభవిస్తున్నట్టు చెప్పారు.

ఇక బ్యారేజీలో ఉన్న మిగిలిన బ్లాకుల్లోని అన్ని పిల్లర్లకు కూడా ఇదే టెక్నాలజీని వాడారన్నారు. అందువల్ల అవి కూడా ఇదే తీరులో డ్యామేజ్ అయ్యేందుకు ఆస్కారం ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్యారేజ్ మొత్తాన్ని తిరిగి నిర్మించాల్సి ఉంటుందన్న అంశంలో కేంద్రం బృంద పరిశీలనలతో తాము ఏకీభవిస్తున్నామన్నారు. దీంతో పాటు మరమ్మతుల పనులు సంతృప్తికరంగా పూర్తయ్యేంత వరకు బ్యారేజీలో నీటిని నిల్వ చేయరాదనే అంశాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ర్ గుర్తుచేశారు.

సెంట్రల్ టీమ్ సూచించిన మేరకు మరమ్మతులు చేసేందుకు, బ్యారేజ్ మళ్లీ ఫంక్షనింగ్ అయ్యేలా చేసేందుకు తమకు సహకారం అందించాలని లేఖలో అథారిటీని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తోందన్నారు. అందువల్ల అంత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు కు వృత్తిపరంగా సహాయ సహకారాలు ఇవ్వాలని కోరారు.

 

You may also like

Leave a Comment