తెలంగాణ(Telangana)లో శాసనసభ ఎన్నికల (Assembly elections)కు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి జాబితాలో మొత్తం 55 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్(congress) ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిగతా స్థానాలపై పార్టీలో చర్చలు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్ తొలి విడత బస్సుయాత్ర తర్వాతనే అభ్యర్థుల రెండో జాబితా ఉండొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 110 నియోజక వర్గాలకు స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసినా వివాదం లేని సగం స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఈనెల 21 తర్వాత ఎప్పుడైనా రెండో జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తొలి జాబితా ప్రకారం.. మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు దక్కాయి. సిట్టింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సతీమణి పద్మావతిరెడ్డికి కోదాడ టికెట్ కేటాయించారు. కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా వామపక్షాలు భద్రాచలం టికెట్ డిమాండ్ చేసినా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదేం వీరయ్యకే మళ్లీ ఆ స్థానాన్ని కేటాయించారు.