మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న పాక్ ఐఎస్ఐ ఏజెంట్(Pak ISI agent) సత్యేంద్ర సివల్(Satyendra Siwal)ను యూపీ ఉగ్రవాద వ్యతిరేక బృందం (ATS) అరెస్ట్ చేసింది. సత్యేంద్ర 2021 నుంచి మాస్కోలో ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హపూర్‌కు చెందిన సత్యేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖలో ఎంటీఎస్ (మల్టీ టాస్కింగ్, స్టాఫ్)గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
భారత ప్రభుత్వ అధికారులను ప్రలోభాలకు గురిచేసి వారి నుంచి భారత సైన్యం, దైనందిన కార్యకలాపాల గురించి సమాచారం రాబట్టినట్టు దర్యాప్తులో సత్యేంద్ర సివల్ అంగీకరించాడు. భారత రాయబార కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన కీలక, రహస్య సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేసినట్టు దర్యాప్తులో గుర్తించారు.
మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో గూఢచర్యం ఆపరేషన్ జరుగుతున్నదని ఏటీఎస్‌కు సమాచారం రావడంతో యూపీ ఏటీఎస్ సివల్‌ను ప్రశ్నించింది. ఏటీఎస్ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని సివల్ ఆపై స్పై ఆపరేషన్ చేసినట్లు అంగీకరించడంతో మీరట్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
సత్యేంద్ర సివల్‌కు ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేల్చారు. రక్షణ, విదేశాంగ సహా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విలువైన సమాచారాన్ని అతడు గూఢచర్య సంస్థకు అందిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు సివల్‌పై అధికారిక రహస్యాల చట్టం-1932 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.