ఒక యుద్ధం మనిషి జీవితాన్ని శాసిస్తుంది అనడానికి చరిత్రలో చోటు చేసుకున్న హింసాత్మకమైన ఎన్నో యుద్ధాలు ఉదాహరణగా నిలిచాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కూడా మానవ జీవితాల ఆచూకి చెరిపివేస్తున్నాయి. ఇక్కడి పరిస్థితులు చూసిన వారి మనసులు చలించి పోతున్నాయి. కాగా ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం (Israel Gaza War)మొదలై నెలరోజులు గడిచినా సమస్యకు పరిష్కారం లభించడం లేదు.
మరోవైపు ఏడారిలా మారిన గాజాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. గాజా వాసులు ఆహారం (Food) తాగునీరు (drinking water) ఇంధనం (fuel) విద్యుత్ , ఔషధాలు (medicines) అందక అల్లాడుతున్నారు. చివరికి ప్రాథమిక వైద్య సామగ్రి అందుబాటులో లేకపోవడం వల్ల డాక్టర్లు అనస్థీషియా ఇవ్వకుండానే చిన్నారులకు వైద్య చికిత్స చేస్తున్నట్టు స్థానిక మీడియా తెలుపుతుంది.
గాజాలో కనీసం గాయాలు శుభ్రం చేసుకోవడానికి కూడా నీరు లేకపోవడం వల్ల.. ఇక్కడి ప్రజలు నరకం చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మానవతా సాయం అందక సుమారుగా 23లక్షల మంది ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. విద్యుత్, ప్రాథమిక వైద్య సామగ్రి అందుబాటులో లేకపోవడంతో గాజా ఆస్పత్రులు.. చివరికి మూతపడే దశకు చేరుకున్నాయి.. ఇక ఈ దాడుల్లో ఇప్పటికే 10వేల మందికి పైగా మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్న యుద్ధం అంటూ తపించే నియంతల కళ్ళు ఎప్పుడు తెరచుకుంటాయో అని మనసున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..