ఇజ్రాయెల్- హమాస్(Israel-Hamas) మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగుతునే ఉంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 26వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గాజా- ఇజ్రాయెల్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఖతార్ ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థానీ(Mohammed bin Abdul Rahman Al Thani) మధ్యవర్త్వం వహిస్తున్నారు.
ఇక, వాషింగ్టన్ డీసీలోని అట్లాంటిక్ కౌన్సిల్లో ఖతార్ ప్రధాని మాట్లాడుతూ.. హమాస్ చేతిలో ఉన్న బందీలను విడిపించడంతో పాటు గాజాలో కాల్పుల విరమణపై జరిపిన చర్చల్లో పురోగతి సాధించామని చెప్పారు. గాజాలో కాల్పుల విరమణకు సానుకూల పరిష్కారంపై చర్చిస్తున్నారు.
ఈ యుద్ధానికి ముగింపు పలికాలని ప్రపంచం మొత్తం చూస్తుందని ఇజ్రాయేల్ ప్రధాని నేతన్యాహూ అన్నారు. ఒకవైపు ఐడీఎఫ్ దళాలను ఉపసంహరించుకోవాలని హమాస్ డిమాండ్ చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ ఈ డిమాండ్లను తిరస్కరించింది. ఒప్పందానికి సంబంధించి ఇంకా లోటుపాట్లు ఉన్నాయని తెలిపింది.
ఈ వారంలో మళ్లీ చర్చలు మరోసారి కొనసాగుతాయని తెలిపింది. ఆదివారం జరిగిన చర్చల్లో కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పకున్నట్లు తెలుస్తోంది. అయితే, గాజాలో బందీలుగా ఉన్న 136మందిని విడిచిపెట్టి యుద్ధానికి తాత్కాలిక ముగింపు పలకడంపై దృష్టి సారించారు. షరతులకు ఒకే చెబితే.. హమాస్ 132 మంది బందీలలో అందరినీ విడిచిపెడుతుందా లేదా కొందరినే పంపిస్తుందా? అనేది ప్రశ్నగా మారింది.