తుర్కియే(Turkiye) నుంచి భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్(Israel) కార్గో నౌక(Cargo Ship)ను ఆదివారం యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ హైజాక్ చేశారు. గాజాపై దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నౌకలో వివిధ దేశాలకు చెందిన 25మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
గెలాక్సీ లీడర్ అనే నౌకను ఎర్ర సముద్రంలో హైజాక్ చేసినట్లు హౌతీ రెబల్స్ ప్రకటించారు. అయితే, అందులో భారతీయులు, ఇజ్రాయెల్ పౌరులు ఎవరూ లేరని ఇజ్రాయెల్ రక్షణ దళం ధ్రువీకరిస్తూ x(ట్విట్టర్)లో పోస్టు చేసింది. ఇది అంతర్జాతీయ పర్యావసనాలకు సంబంధించిన తీవ్రమైన సమస్యగా పేర్కొంది.
హైజాక్‌కు గురైన నౌక తుర్కియే నుంచి భారత్‌కు బయలుదేరిందని, అందులోని సిబ్బంది వివిధ దేశాలకు చెందినవారని తెలిపింది. హమాస్‌కు వ్యతిరేకంగా గాజాపై దాడులు ఆపేంత వరకు ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.
హైజాక్ అయిన నౌకలో భారతీయులు, ఇజ్రాయెల్ పౌరులు ఎవరూ లేరనే విషయాన్ని ఇజ్రాయెల్ పోస్టు ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. మరోవైపు ఆ నౌక అసలు తమ దేశానికి కాదని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. గాజాపై దాడుల నేపథ్యంలో భారత్ వస్తున్న కార్గో నౌక హైజాక్ కావడం కలకలం రేపింది.