చికాగోలో ఇటీవల హైదరాబాద్‌కు చెందిన మజర్ అలీ అనే (Syed Mazhar Ali) విద్యార్థిపై, ఓహియోలో శ్రేయాస్ రెడ్డి (Shreyas Reddy) అనే వ్యక్తిపై దాడులు జరిగాయి. ఈ దాడుల నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు.
అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చేందుకు ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ పౌరులందరికీ ఇది తన భరోసా అని చెప్పారు. మీరు భూమిపై ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడులపై తమ ఆందోళనలను తెలియజేయాలని విదేశాంగ మంత్రి జై శంకర్ ను రేవంత్ రెడ్డి కోరారు. మరోవైపు
సీఎం రేవంత్ రెడ్డితో ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ భేటీ అయ్యారు. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందంపై సీఎం, ఇస్రో చైర్మన్ సమక్షంలో రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ సంతకాలు చేశారు. అంతకు ముందు సెక్రటేరియట్‌కు వచ్చిన ఇస్రో చైర్మన్‌కు సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు.