Telugu News » Gaganyaan Crew Module: అంత‌రిక్ష పరిశోధనలో దూసుకెళ్తున్న ఇస్రో.. మరో ప్రయోగానికి సిద్ధం..

Gaganyaan Crew Module: అంత‌రిక్ష పరిశోధనలో దూసుకెళ్తున్న ఇస్రో.. మరో ప్రయోగానికి సిద్ధం..

క్రూ మాడ్యూల్ (Crew Module) ప‌రీక్ష‌కు ఇస్రో సిద్ద‌మైంది. టీవీ-డీ1 మాడ్యూల్ భూమి నుండి 17 కిలోమీట‌ర్ల ఎత్తుకు వెళ్లిన త‌ర్వాత‌.. అబార్ట్ సీక్వెన్స్‌లో భాగంగా పారాచూట్ల సాయంతో మ‌ళ్లీ భూమి మీద‌కు వ‌స్తుంద‌ని ఇస్రో తెలిపింది.

by Venu

అంత‌రిక్ష పరిశోధన విషయంలో భారత్ (Bharath) ప్రపంచ దేశాల ఊహలకు అందనంత వేగాన్ని పెంచింది. చంద్రయాన్3 (Chandrayaan) సక్సెస్ తర్వాత మరింత దూకుడు పెంచిన ఇస్రో గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టును విజయవంతం చేసే దిశలో అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యోమ‌గాముల్ని (Austronauts) అంత‌రిక్షంలోకి పంపే ప్ర‌య‌త్నాల్లో ఉంది.

ఇందులో భాగంగా ప్రాజెక్టులో కీల‌క‌మైన క్రూ మాడ్యూల్ (Crew Module) ప‌రీక్ష‌కు ఇస్రో సిద్ద‌మైంది. ఇప్పటికే గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌కు చెందిన టెస్ట్ వెహిక‌ల్ అబోర్ట్ మిష‌న్ ను లాంచింగ్ కాంప్లెక్స్‌కు చేర్చారు. తుది ద‌శ‌లో ఉన్న టీవీ-డీ1 మాడ్యూల్ భూమి నుండి 17 కిలోమీట‌ర్ల ఎత్తుకు వెళ్లిన త‌ర్వాత‌.. అబార్ట్ సీక్వెన్స్‌లో భాగంగా పారాచూట్ల సాయంతో మ‌ళ్లీ భూమి మీద‌కు వ‌స్తుంద‌ని ఇస్రో తెలిపింది.

శ్రీహ‌రికోట (Sriharokota) నుంచి 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌ముద్ర ప్రాంతంలో మాడ్యూల్ ల్యాండ్‌ అవుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్ర‌స్తుతం క్రూ మాడ్యూల్‌ను బెంగుళూరులోని ఇస్రో సెంట‌ర్‌లో టెస్టింగ్ చేశారు. టెస్ట్ ఫ్ల‌యిట్ స‌క్సెస్ అయిన త‌ర్వాత గ‌గ‌న్‌యాన్ మిష‌న్ చేప‌ట్ట‌నున్నారు. తాజాగా ఈ మాడ్యూల్‌కు చెందిన ఫోటోలను ఇస్రో (ISRO) తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే భారత్ ఖాతాలో మరో మణిహారం చేరడం ఖాయమంటున్నారు విషయం తెలిసిన నెటిజన్స్..

You may also like

Leave a Comment