సూర్యునిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన ఆదిత్య ఎస్-1 (Aditya L-1)కు సంబంధించి ఇస్రో (ISRo) కీలక అప్ డేట్ (Key Update) ఇచ్చింది. ఆదిత్య ఎల్-1 గమ్యం దిశగా దూసుకు పోతోందని తెలిపింది. జనవరి 6న ఆదిత్య ఎల్-1 తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్ ను చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ వెల్లడించారు.
లెగ్రాంజ్ పాయింట్‌ను ఏ సమయంలో చేరుకుంటుందనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అది ఎల్-1 పాయింట్‌కి చేరుకున్నప్పుడు, అది మరింత ముందుకు వెళ్లకుండా ఇంజన్‌ను మరోసారి ఫైర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. అలా చేయడం ద్వారా ఆదిత్య ఎల్-1 మరింత ముందుకు వెళ్లకుండా దాని చుట్టూ తిరుగుతుందని వివరించారు.
ఆదిత్య-ఎల్1 తన గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు, రాబోయే ఐదేండ్లలో సూర్యునిపై జరిగే వివిధ సంఘటనలను కొలవడానికి అది సహాయపడుతుందన్నారు. సూర్యుడిలో జరిగే మార్పులను మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ఆ సమాచారం చాలా ఉపయోగపడుతుందన్నారు. భారత్ సాంకేతికంగా శక్తివంతమైన దేశంగా ఎలా మారబోతుందనేది కూడా చాలా ముఖ్యమని విషయమని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు ‘అమృత్‌కాల్’సమయంలో ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’పేరుతో భారత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు ఇస్రో ప్రణాళిక రూపొందించిందన్నారు. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్1ను ఇస్రో ప్రయోగించింది. భూమి నుంచి సుమారు 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్-1కు చేరుకున్న తర్వాత కక్ష్యలో పరిభ్రమిస్తూ అధ్యయనం ప్రారంభిస్తుంది.