Telugu News » IT Notice To Congress: రూ.3,567 కోట్లు చెల్లించండి.. కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులు..!

IT Notice To Congress: రూ.3,567 కోట్లు చెల్లించండి.. కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులు..!

ఆదాయపు పన్ను వ్యవహారంలో రెండు రోజుల కిందట రూ.1,823 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపిన ఐటీ శాఖ(IT Department) తాజాగా మరో నోటీసును పంపింది. గతంలో ఆదేశించిన మొత్తంతో పాటు రూ.1,745కోట్లు అదనంగా మొత్తం రూ.3,567కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.

by Mano
IT Notice To Congress: Pay Rs.3,567 Crores.. IT Notices To Congress..!

లోక్‌సభ ఎన్నికలు(Lock Sabha Elections) దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆదాయపు పన్ను వ్యవహారంలో రెండు రోజుల కిందట రూ.1,823 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపిన ఐటీ శాఖ(IT Department) తాజాగా మరో నోటీసును పంపింది. గతంలో ఆదేశించిన మొత్తంతో పాటు రూ.1,745కోట్లు అదనంగా మొత్తం రూ.3,567కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.

IT Notice To Congress: Pay Rs.3,567 Crores.. IT Notices To Congress..!

లోక్‌సభ ఎన్నికలకు ముందు తాము తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నామని కాంగ్రెస్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అందుకు న్యాయస్థానం తిరస్కరించిన వెంటనే ఐటీ విభాగం కొత్త నోటీసులను జారీ చేసింది. ఈ విషయంపై కాంగ్రెస్‌ సుప్రీం కోర్టును సోమవారం ఆశ్రయించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

2014-15 సంవత్సరానికి రూ. 663 కోట్లు, 2015-16కు రూ.664 కోట్లు, 2016-17కు రూ. 417 కోట్లు అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయ పార్టీలకు ఇచ్చే పన్ను మినహాయింపు ముగిసినందున ఆ పార్టీకి చెందిన మొత్తం ఆదాయంపై పన్ను విధించినట్లు తెలిపాయి. మరుసటి రోజే నోటీసులు 2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి మొత్తం రూ.1,823 కోట్లకు పైగా చెల్లించాలని ఐటీ విభాగం శుక్రవారం కాంగ్రెస్‌కు నోటీసులు పంపింది.

2017-2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలనను నిలిపేయాలన్న కాంగ్రెస్‌ పిటిషన్లను గురువారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన మరోసటి రోజే ఐటీ శాఖ తాజా నోటీసులు జారీ చేసింది. కాగా, మదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ఆధారాలు ఐటీ అధికారుల దగ్గర ఉన్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది.

అంతకుముందు 2014-15 నుంచి 2016-17 మధ్య కాలానికి సంబంధించి ఐటీశాఖ పునఃపరిశీలనను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇవే కారణాలతో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 2014-15 నుంచి 2016-17 పునఃపరిశీలనకు సంబంధించి రూ.200 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్‌కు ఐటీ విభాగం స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల నుంచి రూ.135 కోట్లను రికవరీ చేసింది.

You may also like

Leave a Comment