Telugu News » IT Notices to Chandrababu Naidu: అమరావతి సబ్ కాంట్రాక్టుల స్కాంలో చంద్రబాబుకు ఐటీ నోటీసులు

IT Notices to Chandrababu Naidu: అమరావతి సబ్ కాంట్రాక్టుల స్కాంలో చంద్రబాబుకు ఐటీ నోటీసులు

చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీన హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ

by Prasanna
IMG_IMG_Chandrababu_2_1__2_1_SLBE0D8P

అమరావతి కాంట్రాక్టర్ (Amaravati Contracts) నుంచి సబ్ కాంట్రాక్టులు పొందిన వారి నుంచి చంద్రబాబు (Chandrababu) కు ముడుపులు అందాయని ఐటీ శాఖ (IT Department) చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి కాంట్రాక్టులు పొందిన షాపూర్జి పల్లోంజి (ఎస్పీసీఎల్), ఎల్ అండ్ టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు రూ. 118 కోట్ల ముడుపులు ముట్టాయనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో బోగస్ సబ్ కాంట్రాక్టు (Sub Contracts) సంస్థలు నుంచి చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఆదాయపన్ను శాఖ అధికారులు చంద్రబాబుకు ఈ విషయంపై సమాధానం చెప్పాలంటూ నోటీసులు ఇచ్చారు.

IMG_IMG_Chandrababu_2_1__2_1_SLBE0D8P

ఈ ముడుపుల విషయం మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో బయటపడిందని ఐటీశాఖ అధికారులు చెబుతున్నారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల రూపంలో ముడుపులు పొందినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీన హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కొన్ని బోగస్ సంస్థల నుంచి వచ్చిన రూ. 118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను నోటీసుల్లో ఐటీ శాఖ ప్రస్తావించింది. షాపూర్జి పల్లోంజి, ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులతో పాటు ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే  సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు తేలిందని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు.

అమరావతిలో కాంట్రాక్ట్ పనుల ఒప్పందాలు మొదలైన 2016లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా మనోజ్ వాసుదేవ్ టచ్ లోకి వెళ్లారు. ఆ తర్వాత శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు అందుకున్నారని సమచారం. ఈ విషయాన్ని ఒక ఆంగ్ల పత్రిక బయటపెట్టింది.

You may also like

Leave a Comment