Telugu News » One Nation-One election- ”ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు” కేంద్రం కీలక నిర్ణయం..!

One Nation-One election- ”ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు” కేంద్రం కీలక నిర్ణయం..!

‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.

by Sai
what is one nation one lection

కేంద్రంలో బీజేపీ (BJP) ప్రభుత్వం 2014 నుంచి చెబుతున్న ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’(One Nation-One election) విధానం మళ్లీ తెరమీదకు వచ్చింది. దానికి కారణం సెప్టెంబరు 18 నుంచి 22 వరకు అత్యవసర పార్లమెంటరీ సమావేశం జరుగుతుండటమే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారిక ప్రకటన విడుదల చేశారు.

what is one nation one lection

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక దేశం, ఒకే ఎన్నిక బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(Ramnathkovind) నేతృత్వంలో పార్లమెంట్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో ఇతర సభ్యుల పేర్లతో ఓ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కాబోతోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో ఈ వివరాలను తెలిపారు

ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఒకే రోజున ఎన్నుకోవచ్చు.

దేశంలో ఒకే సారి పార్లమెంటు, అసెంబ్లీల ఎన్నికలు నిర్వహించాలని చాలా కాలంగా కొందరు వాదిస్తున్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా పలు సందర్భాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.

You may also like

Leave a Comment