అప్పుడప్పుడు మనకు తెలియని విషయాలు సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. ఎవరైనా చెప్పినవి కానీ ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు కానీ బయటకి వస్తూ ఉంటాయి. కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తే, వాటిని విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు ఏపీ సీఎం జగన్ గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం జగన్ ఫిట్ గా ఉంటారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యంగా ఉల్లాసంగా కనపడుతూ ఉంటారు జగన్. అయితే జగన్ కి సంబంధించిన విషయాలు కొన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also read:
వీటిని అందరూ విపరీతంగా షేర్ చేస్తున్నారు ఆ మధ్య మంత్రి రోజా జగన్ ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడారు. ప్రస్తుతం అది హాట్ టాపిక్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి ఉదయం నాలుగున్నర గంటలకి నిద్ర లేస్తారట. గంట సేపు యోగా జిమ్ చేస్తారు తర్వాత న్యూస్ పేపర్ చదువుతారు. న్యూస్ పేపర్ చదువుతూ ఆయన నోట్స్ ని కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఆ టైంలో కేవలం టీ మాత్రమే తాగుతారు అలానే జగన్మోహన్ రెడ్డి ఉదయం ఏడు గంటలకి జ్యూస్ తీసుకుంటారట. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్లో కేవలం డ్రై ఫ్రూట్స్ ని మాత్రమే తీసుకుంటూ ఉంటారు. సమీక్షలు టైంలో అయితే చాక్లెట్స్ తింటారు.
మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే అన్నం కంటే పుల్కాలని తినడానికి ఇష్టపడతారట రాగి ముద్ద మటన్ కీమాని కూడా ఇష్టపడతారట. మధ్యాహ్నం భోజనంలో కచ్చితంగా పెరుగు తింటారట. చిత్రాన్నం అంటే ఆయనకి ఫేవరెట్. సాయంకాలం టీ మాత్రమే తీసుకుంటారు పల్లీలు మొక్కజొన్న పొత్తులు కూడా తీసుకుంటూ ఉంటారట. ఆయనకి ఇవి చాలా ఇష్టం అలానే వీకెండ్ లో ఫ్యామిలీతో పాటుగా నాన్ వెజ్ తీసుకుంటారు. ఆదివారం చేపల పులుసు, బిర్యాని మటన్ వంటివి తీసుకుంటారు. ఇవన్నీ ఆయన ఫేవరేట్ అయినా లిమిట్ గానే వీటిని తీసుకుంటారు. లీటర్ పాలల్లో అల్లం వేసి మరిగించి దానిని తాగుతారట. ఇవి జగన్ ఆరోగ్య సీక్రెట్స్ అందుకే ఈయన ఇంత ఫిట్గా ఆరోగ్యంగా ఉన్నారు.