అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections)ఎన్నో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.. అందులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేవారు ఓటర్లను ఆకర్షించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నోటుకు అమ్ముడు పోకుండా ఓటు వేసి నిజాయితీ పరున్ని గెలిపించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇలాగే భావిస్తున్న ఓ యువకుడు జగిత్యాల (Jagityal) జిల్లాలో వినూత్న ప్రచారం నిర్వహించాడు.
జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri) పట్టణంలో స్వతంత్ర అభ్యర్థి (Independent candidate) మోతే నరేష్ (Mothe Naresh) ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా బీరు, లిక్కర్ బాటిళ్లతో.. చిరిగిన బట్టలు వేసుకొని చూపరులను ఆకట్టుకుంటున్నాడు.. ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ఇచ్చే డబ్బు, మద్యానికి లొంగకుండా నిజాయితీగా ఉన్న అభ్యర్థులను గుర్తించి ఓటు వేయాలని గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేపట్టాడు నరేష్..
ఎన్నికలప్పుడు ప్రలోభాలకు లోనైతే.. ఐదు సంవత్సరాలు బానిసలా బతుకవలసి వస్తుందని నరేష్ గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే విద్యా, వైద్యం, ఉపాధి లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తూ ప్రభుత్వం రైతులను కూడా ముంచుతుందని విమర్శించారు. అందుకే ఈ ఎన్నికల సమయంలో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు నరేష్..
మరోవైపు తన గుర్తు రోడ్డు రోలర్ గుర్తని.. నేను నిజాయితీగా ప్రజా సేవ చేయాలని భావిస్తున్నట్టు తెలిపిన నరేష్.. ఎన్నికల సమయంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థిని ఎంచుకోండని చెబుతున్నాడు.. ఇక గత ఎన్నికల్లో తానుగాడిద పై వచ్చి నామినేషన్ వేశానని నరేష్ గుర్తు చేశారు..