దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు గడిచింది. అయినా కనీస సదుపాయాలు లేని గ్రామాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. అనేక గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల జాడే లేదు. మరికొన్ని గ్రామాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లోని బందీపోరా జిల్లాలోని ‘గురేజ్’(Gurej) అనే సరిహద్దు ప్రాంతానికి అధికారులు విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు.
ఈ మేరకు గురేజ్‌లో పవర్ గ్రిడ్‌ను అనుసంధానించారు. జమ్మూకశ్మీర్‌లోని ఓ చిన్న గ్రామంలో సుమారు 3,500 జనాభా ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవి చేపట్టేవరకూ అంధకారంలో ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు వెలుగులు నిండనున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా ఇలాంటి గ్రామాలు లెక్కలేనన్ని ఉన్నాయని పలువురు అంటున్నారు.
జమ్మూ లెఫ్టినెట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. ‘33/11kV సబ్ స్టేషన్ ద్వారా 1,500 మంది వినియోగదారులకు కరెంటు సరఫరా చేస్తున్నాం. అన్ని గ్రామాలను దశలవారీగా కనెక్ట్ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాం.. గురేజ్‌కి ఇది చరిత్రాత్మక రోజు.’ అని చెప్పుకొచ్చారు.
గురేజ్ సెక్టార్‌కు ఏటా చలికాలంలో భారీ మంచు కురుస్తున్నందున బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. దీంతో అక్కడి ప్రజలు జనరేటర్లను వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు ఈ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేయడంతో వారి జీవితాల్లో వెలుగులు నిండాయి.