జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లోని పూంచ్, రాజౌరీ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో సాయుధ బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ సెర్చ్ ఆపరేషన్(Search Operation)లో భాగంగా ఆయా జిల్లాల్లో ఇవాళ ఉదయం ఇంటర్నెట్(Internet) సేవలను నిలిపివేశారు.
గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. సీనియర్ ఆర్మీ, పోలీసు అధికారులు ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. సున్నిత ప్రదేశాల్లో అదనపు బలగాలు, పారామిలిటరీ దళాలను మోహరించారు.
మొబైల్ సేవలను నిలిపివేసి ఎలాంటి సమాచారం బయటకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. విస్తృత స్థాయిలో రెండు జిల్లాల సరిహద్దుల వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఇది నెల రోజుల వ్యవధిలో సైన్యంపై జరిగిన రెండో ఉగ్రదాడి.
బుధవారం(డిసెంబర్ 21)న జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో సాయుధ పోలీసు యూనిట్ కాంపౌండ్‌లో పేలుడు సంభవించిన తర్వాత ఈ సంఘటన జరిగింది. జవాన్ల వాహనం ముందే వస్తుందన్న సమాచారం ఉగ్రవాదులకు ముందే తెలిసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అటు.. జవాన్లు కూడా ఉగ్రవాదులపై కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది.