Telugu News » JR NTR : జపాన్ లో భూకంపం… అభిమానుల్లో ఆందోళన….స్పందించిన జూనియర్ ఎన్టీఆర్…!

JR NTR : జపాన్ లో భూకంపం… అభిమానుల్లో ఆందోళన….స్పందించిన జూనియర్ ఎన్టీఆర్…!

పలు ప్రాంతాల్లో జపాన్ మెట్రలాజికల్ అథారిటీ సునామి హెచ్చరికలను జారీ చేసింది. భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎనిమది మరణించినట్టు అధికారులు గుర్తించారు.

by Ramu
Jr NTR returns from Japan hours after multiple earthquakes tsunami hit country

వరుస భూకంపాల (Earthquakes)తో జపాన్ వణికి పోతోంది. భూకంపాల వల్ల జపాన్‌ (Japan)లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో జపాన్ మెట్రలాజికల్ అథారిటీ సునామి హెచ్చరికలను జారీ చేసింది. భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎనిమది మరణించినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓ షాకింగ్ న్యూస్ పోస్టు చేశారు.

Jr NTR returns from Japan hours after multiple earthquakes tsunami hit country

జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌లో వారం రోజుల పాటు హాలీడేస్ ఎంజాయ్ చేశారు. తన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్ లతో కలిసి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను జపాన్ లోనే జరుపుకున్నారు. జపాన్‌లో పలు ప్రాంతాల్లో తిరుగుతూ కుటుంబంతో సంతోషంగా గడిపారు. ఈ క్రమంలో జపాన్ లో భూకంపం రావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కంగారు పడ్డారు.

ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. జపాన్ నుంచి తాను నిన్నే ఇండియాకు వచ్చానని వెల్లడించారు. ఇంతలోనే భూకంపంలో వరుస భూకంపాల వార్త విని షాక్ అయ్యానని చెప్పారు. గత వారం రోజులుగా తాను జపాన్ లో వెకేషన్ ఎంజాయ్ చేశానన్నారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో భూకంపం రావడంతో తాము కలత చెందామన్నారు.

ఈ భూకంప ప్రభావం నుంచి జపాన్ త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ జపాన్ నుంచి వచ్చేశారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరి కొన్ని గంటలు ఆలస్యం అయ్యుంటే తమ హీరో భూకంపంలో చిక్కుకునే వారని, టైం గాడ్ ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

You may also like

Leave a Comment