మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్టు ప్రభావం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాల పై పడింది. అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా టిడిపి (TDP) కార్యకర్తలు వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే తెలుగు దేశం (Telugu Desam) పార్టీకి చెందిన క్యాడర్‌లోని కొంత మంది ఎన్టీఆర్ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం చంద్రబాబు క్లిష్ట సమయాల్లో తారక్ ని వాడుకుని ఒదిలేసాడని అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఎవరు ఏమనుకొన్న చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ తన మద్దతు తెలియజేయకపోవడంతో.. ఎన్టీఆర్ నటించిన సినిమాలను ఏపీ (AP) లో ఆడనివ్వమని వార్నింగ్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
బాబు అభిమాని ఒకరు ఎన్టీఆర్ కు ఫోన్ చేసి మరి సినిమాల విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనే వార్త వైరల్ గా మారింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క షో ఆపి చూడండి అంటూ సవాల్ కూడా విసిరారని వినిపిస్తోంది. ఇలా ఇప్పటి వరకు ఎన్నో రకాల విమర్శలు వచ్చినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు అరెస్టు విషయంపై స్పందించకపోవడం గమనార్హం.