Telugu News » Uttam Kumar Reddy : గత ప్రభుత్వంలా కమిషన్లకి కక్కుర్తిపడం.. ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకొని కూర్చుంటాం..!!

Uttam Kumar Reddy : గత ప్రభుత్వంలా కమిషన్లకి కక్కుర్తిపడం.. ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకొని కూర్చుంటాం..!!

తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఐదేళ్లలో రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో తనకు మంచి రాజకీయ సంబంధం ఉందన్నారు.. తన హయాంలో మొదలైన ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హయాంలో పూర్తి కాబోతున్నాయని తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు.

by Venu
uttham

తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలు, వారి త్యాగాల కారణంగా కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం, సోనియాగాంధీ ఇచ్చిందని, కేసీఆర్ ఫ్యామిలీ ప్రయోజనాల కోసం కాదని ఇప్పటికి కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పై సమీక్షలు నిర్వహిస్తోన్న హస్తం నేతలు.. గత ప్రభత్వం పై విరుచుకుపడుతోన్నారు. ప్రతి శాఖలో అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

minister uttam kumar reddy said that lifts and check dams are incomplete in telangana

ఈ క్రమంలో ప్రజా పాలనపై ఉమ్మడి నల్లగొండ (Nalgonda) ఎంఎన్ఆర్ కన్వెన్షన్ హాల్ లో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా ఇన్ చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy).. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమైయ్యారు.. ఈ సందర్భంగా మంత్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు.. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలను అమలు చేశామని తెలిపిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజా పాలన పారదర్శకంగా చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.. గత ప్రభుత్వంలా కమిషన్లకి కక్కుర్తిపడే ప్రభుత్వం తమది కాదని అన్నారు.. పనులు పూర్తి అయ్యే వరకి.. ప్రాజెక్టుల వద్దే కుర్చీ వేసుకుని.. నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఉత్తమ్ తెలిపారు.. పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఐదేళ్లలో రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో తనకు మంచి రాజకీయ సంబంధం ఉందన్నారు.. తన హయాంలో మొదలైన ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హయాంలో పూర్తి కాబోతున్నాయని తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు.

You may also like

Leave a Comment