విశాఖ ఫిషింగ్ హార్బర్(Visakha Fishing Harbour)లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం మరువక ముందే సాగర తీరంలో మరో పెను ప్రమాదం సంభవించింది. కాకినాడ తీరంలో సముద్రంలో వెళ్తున్న బోటు అగ్ని ప్రమాదానికి(Fire Accident) గురైంది. సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో భోజనం వండుకొనేందుకు అవసరమైన సరుకులతో పాటు గ్యాస్ సిలిండర్‌ను తీసుకెళ్తారు. అయితే సిలిండర్ బోటులో పేలడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. బోటు ఇంజిన్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా బోటు ముందు భాగం దగ్ధమైంది.
ఉదయం 9 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో వేటకు వెళ్తున్న మత్య్సకారులు బోటులో ఉండగానే గ్యాస్ సిలిండర్ పేలింది. దోంతో ఒక్కసారిగా మంటలు బోటు మొత్తం అంటుకున్నాయి. దీంతో మత్య్సకారులు లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకేశారు. ఇక, విషయం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్యూ ఆపరేషన్ నిర్వహించారు.
సముద్రంలో కొట్టుకుపోతున్న 11మందిని కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షింతంగా ఒడ్డుకు చేర్చారు. లైఫ్ జాకెట్లు ధరించడం, కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్యూ ఆపరేషన్ చేయడంతో మత్య్సకారులకు ప్రాణ ముప్పు తప్పింది. దీంతో వారు అందరు ఊపిరి పీల్చుకున్నారు.