Telugu News » Kangana Ranaut: ఇందిరాగాంధీతో కంగన చిట్‌చాట్.. ఇది కలా నిజమా..?

Kangana Ranaut: ఇందిరాగాంధీతో కంగన చిట్‌చాట్.. ఇది కలా నిజమా..?

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌(Kangana Ranaut)కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కంగనా స్వయంగా ఇందిరా గాంధీ(Indira Gandhi) ఎదురుగా కూర్చొని ఆమెతో ముచ్చటిస్తున్నట్లుగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

by Mano
Kangana Ranaut: Kangana's chit chat with Indira Gandhi.. Is this art real..?

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌(Kangana Ranaut)కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కంగన స్వయంగా ఇందిరా గాంధీ(Indira Gandhi) ఎదురుగా కూర్చొని ఆమెతో ముచ్చటిస్తున్నట్లుగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా..? ఈ ఫొటో నిజంగా కంగన ఇందిరా గాంధీతో మాట్లాడుతున్నట్లే ఉంది కదా.. ఇదెలా సాధ్యపడిందంటే.. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సృష్టి.

Kangana Ranaut: Kangana's chit chat with Indira Gandhi.. Is this art real..?

అయితే కంగన సోమవారం ఢిల్లీలోని ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సందర్శించింది. ‘వీరాంగనా కీ మహాగాథ’ పేరిట ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ షో లో ఈమె పాల్గొంది. అనంతరం ఆమె ఇందిరా గాంధీ, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ (ఏఐ ఇమేజ్)తో దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. ‘చరిత్రలోని అనేక అధ్యాయాలు ఈ షో ద్వారా నా కళ్ల ముందు కనిపించాయి. ప్రతీఒక్కరూ కుటుంబంతోపాటు వచ్చి వినోదాన్ని పొందవచ్చు’ అని పేర్కొంది.

కంగన రనౌత్ మెగాఫోన్ పట్టిన సంగతి తెలిసిందే. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్సెన్సీ’. ఈ సినిమాలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించనుంది. ఇందిరా గాంధీ హయాంలో దేశంలోని ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాతో 1975 నాటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని దాదాపు 48 ఏళ్ల తర్వాత ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక జూన్‌లో రిలీజైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. అయితే సినిమాను నవంబర్ 24న విడుదల చేస్తామని మొదట్లో చిత్రబృందం ప్రకటించింది. కానీ, అనివార్య కారణాలతో విడుదలను వాయిదా వేశారు. ఇక 2024లో జూన్‌ లోపు ‘ఎమర్జెన్సీ’ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కంగన ‘ఏఐ’ని బాగా వాడుకుంది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ‘నమ్మలేక పోతున్నా.. ఇది కలా నిజమా..?’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

You may also like

Leave a Comment