లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతల్లో, కార్యకర్తల్లో పునరుత్తేజాన్ని నింపడానికి గులాబీ దళపతి కేసీఆర్.. రంగంలోకి దిగారు.. ఈ క్రమంలో కరీంనగర్ (Karimnagar)లో మరోసారి కదనశంఖం పూరించారు. కేసీఆర్ (KCR) నేతృత్వంలో SRR కాలేజీ మైదానం తలపెట్టిన కదనభేరీ సభలో కాంగ్రెస్, బీజేపీ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ రెండూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.
మరోవైపు ఈ సభలో బీజేపీ (BJP) ఎంపీ బండిసంజయ్ (Bandi Sanjay)పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan) తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అసలు బండికి మీటర్ తెల్వది.. మోటర్ తెల్వదిని విమర్శించారు.. అసలు ఆయనకు మీటరే లేదని వ్యంగ్యంగా దెప్పి పొడిచారు.. మీటర్ ఉంటేనే కొట్లాడుతారన్న రసమయి.. బండి చేస్తున్న యాత్రను ఉద్దేశించి ‘చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు’ అంటూ పాట పాడి సెటైర్లు వేశారు.
ప్రజా యాత్ర చేసే వారు ప్రజల దగ్గరికి పోవాలని.. ఎండిన చేను దగ్గరికి పోవాలని.. కానీ బండి మీసాలు వచ్చిన యువకుల దగ్గరికి వెళ్తున్నారని సంచలన కామెంట్ చేశారు. ఏప్పుడూ.. ఇవ్వాళ ఏం వారమే రేపు ఏం వారమే అని బండి అంటారని రసమయి మండిపడ్డారు. దొడ్లో బర్రెలను పిలిచినట్లు బండి అన్నా.. అంటారని ఎద్దేవా చేశారు.. కాగా బండిపై రసమయి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.