అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) రాజకీయ నాయకులనే కాదు పోలీస్ అధికారులను కూడా కాలు నిలువనీయకుండా పరిగెత్తిస్తున్నాయి. పక్క పార్టీలోకి జంప్ అవుతున్న నేతలు ఒకవైపు.. ట్రాన్స్ ఫర్ పేరుతో పోలీస్ అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా మరో ఇద్దరిపై బదిలీ వేటు వేసింది.
కరీంనగర్ (Karimnagar) కలెక్టర్ (Collector)గోపి, సీపీ సుబ్బారాయుడుని బదిలీ చేస్తూ ఈసీ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కరీంనగర్ కలెక్టర్ గా గోపి మూడు నెలలు మాత్రమే విధులు నిర్వహించారు. ఇంతలోనే ఆయనను బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు ఇవ్వడం కరీంనగర్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు రాష్ట్రంలో పలువురు అధికారులు బీఆర్ఎస్‌కు కొమ్ముకాస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే సమయంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్, కమిషనర్ (Commissioner)పై ఒకేసారి బదిలీ వేటు పడటం హాట్ టాపిక్‌గా మారింది…