Telugu News » Vinod Kumar : ఇంటి పేరు ఒకటే ఉంటే చుట్టాలు అవుతారా…. బద్నాం చేసేందుకే ఈ వార్తలు….!

Vinod Kumar : ఇంటి పేరు ఒకటే ఉంటే చుట్టాలు అవుతారా…. బద్నాం చేసేందుకే ఈ వార్తలు….!

ఇంటిపేరు ఓకే విధంగా ఉంటే చుట్టాలుగా పరిగణించడం అనేది ఏ సంస్కృతి? అంటూ మండిపడ్డారు.

by Ramu
Vinod Kumar: Not a single rupee was paid to Bandi Sanjay Karimnagar: Former MP Vinod Kumar

అసత్య వార్తలతో బీజేపీ, కాంగ్రెస్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinpally Vinod Kumar) అన్నారు. ఇంటిపేరు ఓకే విధంగా ఉంటే చుట్టాలుగా పరిగణించడం అనేది ఏ సంస్కృతి? అంటూ మండిపడ్డారు. తనపై క్యూ న్యూస్‌లో తీన్మార్ మల్లన్న అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. జర్నలిజం విలువలు తెలియని వాళ్ళు ముందు జర్నలిజం చేసి వార్తలు రాయాలని ధ్వజమెత్తారు.

Vinod Kumar Boinapally

కరీంనగర్‌లో మీడియా సమావేశంలో బోయినపల్లి వినోద్ కుమర్ మాట్లాడుతూ…. . బీజేపీ సోషల్ మీడియాలో ఆ వార్తలను ఏ ఆధారాలతో వేశారని ప్రశ్నించారు. ఇంటిపేరు ఓకే విధంగా ఉంటే చుట్టాలుగా పరిగణించడం అనేది ఏ సంస్కృతి? అని నిప్పులు చెరిగారు. వార్తలు వేసే ముందు జర్నలిజం గురించి తీన్మార్ మల్లన తెలుసుకోవాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన అన్న కూతురు బోయినపల్లి సరితకు అర్హత లేకపోయినప్పటికీ విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇచ్చారని వార్తలు ప్రసారం చేస్తున్నారని చెప్పారు. అసలు తనకు అన్నే లేరని స్పష్టం చేశారు. ఆ సరిత ఎవరో తెలియదని వెల్లడించారు. ఇంటి పేరు కలిస్తే తనకు ముడిపెట్టడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో ప్రపంచమంతా తిరిగిన అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

బ్యాంకులను నీరవ్ మోడీ మోసం చేశారని అన్నారు. నీరవ్ ఇంటి పేరు మోడీ ఉంటే ప్రధాని మోడీకి ఆయనకు సంబంధం ఉన్నట్లా అని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో లబ్ది కోసం బీజేపీ ఎంపీ బండి సంజయ్ దుష్ప్రచారం చేయించడం సరికాదని తీవ్రంగా విరుచుకు పడ్డారు. తనను రాజకీయంగా బద్నాం చేసేందుకే ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment