Telugu News » Karnataka : అరవై ఎనిమిది సంవత్సరాల నిస్వార్ధానికి.. రాజ్యోత్సవ అవార్డు..!!

Karnataka : అరవై ఎనిమిది సంవత్సరాల నిస్వార్ధానికి.. రాజ్యోత్సవ అవార్డు..!!

ఎంత సంపద ఉన్నదన్నది ముఖ్యం కాదు.. మన దగ్గర ఉన్న సంపద సమాజం శ్రేయస్సుకు ఎంత వరకు ఉపయోగపడిందనేదే ముఖ్యం.. ఇలా అందరూ ఆలోచిస్తే సమాజం కల్మషం లేకుండా ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటున్నారు

by Venu

స్వార్ధం మనిషిని చెడు మార్గం వైపు మళ్లిస్తే.. నిస్వార్ధం ఆదే మనిషిని దేవుడినిగా కొలిచేలా చేస్తుంది. కానీ నేటి సమాజం పూర్తిగా స్వార్థపూరితంగా మారిపోయింది. ఇలా ఎన్నోకలుపు మొక్కల మధ్య పరిమళించిన మంచి మనస్సు ఉన్న అమ్మ హుచ్చమ్మ.. ఎంత ఉన్న ఇంకా కావాలని ఆస్తుల కోసం పరుగులు తీస్తున్న కాలంలో తనకు జీవనాధారం అయిన భూమిని భావి భారత పౌరుల భవిష్యత్తు కోసం నిస్వార్ధంగా ఈ అమ్మ దానం చేసింది.

ఈ ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రం లోని కొప్పాల (Koppaala)లో చోటు చేసుకుంది. కొప్పాల ప్రాంతానికి చెందిన హుచ్చమ్మ (Huchamma) తనకి ఆసరాగా ఉన్న రెండు ఎకరాల పొలంని తన్నూరు పాఠశాల (School)కు విరాళంగా (Donated)ఇచ్చారు. 68 సంవత్సరాల వయసులో తనకున్న జీవనాధారం పోతే ఎలా బ్రతకాలని ఈ తల్లి ఆలోచించలేదు. తాను చేసిన సహాయం కూడా ఎవరికి చెప్పలేదు.. ఇక జీవనోపాధి కోసం ఆ పాఠశాలలో వంటమనిషిగా చేరారు హుచ్చమ్మ..

ఈమేరకు పిల్లలు లేని ఆ తల్లి పాఠశాలలో చదివే పిల్లలే తన పిల్లలుగా భావించి సంతోష పడుతుంది. అంతటి మనసున్న ఈ తల్లి నిస్వార్ధానికి రాజ్యోత్సవ అవార్డు దక్కింది. మరోవైపు హుచ్చమ్మ ఈ అవార్డుకు నమోదు కూడా చేసుకోలేదు. కానీ ఆమె నిస్వార్ధ సేవకు ఈ అవార్డు వెతుక్కుంటూ వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఏటా రాష్ట్ర స్థాపన సందర్భంగా నవంబర్ 1వ తేదీన రాజ్యోత్సవ అవార్డును ప్రదానం చేస్తుంది.

కాగా ఈ సంవత్సరం కూడా కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులు ముగ్గురిని వరించగా.. రాజ్యోత్సవ అవార్డు అందుకున్న వారిలో హుచ్చమ్మ కూడా ఒకరు.. ఎంత సంపద ఉన్నదన్నది ముఖ్యం కాదు.. మన దగ్గర ఉన్న సంపద సమాజం శ్రేయస్సుకు ఎంత వరకు ఉపయోగపడిందనేదే ముఖ్యం.. ఇలా అందరూ ఆలోచిస్తే సమాజం కల్మషం లేకుండా ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటున్నారు ఈ విషయం తెలుసుకున్న పెద్దలు..

You may also like

Leave a Comment