నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడో ఒకచోట గొడవలు జరగడం తెలిసిందే.. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ప్రయాణికులు ఆర్టీసీ (RTC) సిబ్బందిపై దాడికి పాల్పడటం.. సిబ్బంది కూడా తామేమి తక్కువ కాదన్నట్లు ప్రయాణికులతో వాగ్వాదానికి దిగడం కామన్ గా మారిపోయింది.
ఈ నేపథ్యంలో బెంగళూరు (Bangalore)లో ఇలాంటి ఘటన జరిగింది.. మహిళ ప్రయాణికురాలిపై బస్సు కండక్టర్ (Conductor) విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు.. కర్నాటక (Karnataka)కి చెందిన ఆర్టీసీ కండక్టర్ కు, మహిళా ప్రయాణికురాలుకు బస్సు టికెట్ విషయంలో గొడవ చిన్నగా మొదలయ్యింది. అదికాస్త కాసేపటికి వివాదానికి దారితీసింది. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ ప్రయాణికురాలు బస్సు కండక్టర్ పై చెయ్యి చేసుకొంది.
ఆ మహిళ ప్రవర్తనకు ఆగ్రహించిన కండక్టర్ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.. తోటి ప్రయాణికులు వారించిన వినకుండా ఆ మహిళను బస్సులోనే కిందపడేసి దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు తోటి వారు తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ఇద్దరిది తప్పు ఉన్నా.. కండక్టర్ అంతలా దాడికి దిగడం సరికాదని, కాబట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు..