Telugu News » Karthika Masam 2023 : కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు తెలుసా..?

Karthika Masam 2023 : కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు తెలుసా..?

రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలైన వేములవాడల, తిరుపతి (Tirupati) శ్రీశైలం (Srisailam) విజయవాడ దుర్గమ్మ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు. మరోవైపు నవంబర్‌ 27న కార్తీక పౌర్ణమి ఘడియలు మధ్యాహ్నం వరకే ఉండటం వల్ల.. 26 వ తేదీన ప్రదోష కాలం నుంచి పౌర్ణమి ఘడియలు మొదలవుతున్నట్టు పండితులు తెలుపుతున్నారు.

by Venu

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభమైంది. అయితే ప్రతి సంవత్సరం దీపావళి మర్నాడే కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కానీ ఈసారి దీపావళి మర్నాడు కాకుండా రెండో రోజు నుంచి కార్తీకమాసం ఆరంభం అవుతుందని పండితులు చెబుతున్నారు.. సూర్యోదయానికి పాడ్యమి తిథి కార్తీక మాసం ప్రారంభానికి సూచన. అయితే నవంబరు 12న దీపావళి 13న సోమవారం సూర్యోదయానికి అమావాస్య ఉంది. అందుకే నవంబరు 14 మంగళవారం సూర్యోదయం సమయానికి పాడ్యమి ఉండడంతో ఆ రోజు నుంచి ఆకాశదీపం ప్రారంభమవుతోంది. అంటే నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతోందని పండితులు తెలిపారు.

కార్తీక మాసం శ్రీ మహా విష్ణువు (Sri Maha Vishnu) శివుడికి (Shiva) అత్యంత ప్రీతికరమైన రోజులుగా చెబుతారు. కాగా కార్తీక మాసం.. నవంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమై డిసెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు ఆచరించిన భక్తులు శివాలయాలు, వైష్ణవ క్షేత్రాల్లో (Vaishnava Kshetras) దీపారాధన చేస్తూ శివుడికి, శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలైన వేములవాడల, తిరుపతి (Tirupati) శ్రీశైలం (Srisailam) విజయవాడ దుర్గమ్మ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు. మరోవైపు నవంబర్‌ 27న కార్తీక పౌర్ణమి ఘడియలు మధ్యాహ్నం వరకి ఉండటం వల్ల.. 26 వ తేదీన ప్రదోష కాలం నుంచి పౌర్ణమి ఘడియలు మొదలవుతున్నట్టు పండితులు తెలుపుతున్నారు. ఈ కారణంగా 26వ తేదీ సాయంత్రమే శ్రీశైలంలో కృష్ణవేణీ నదీ హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదే రోజు సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్రమ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

ఇక కార్తీక మాసంలో ఉన్న ముఖ్యమైన రోజులు.. నవంబరు 14 మంగళవారం పాడ్యమి..కార్తీకమాసం ప్రారంభం.. నవంబరు 15 బుధవారం యమవిదియ.. భగినీహస్త భోజనం.. నవంబరు 17 శుక్రవారం నాగుల చవితి.. నవంబరు 20న కార్తీకమాసం మొదటి సోమవారం, కార్తావీర్యజయంతి.. నవంబరు 22న యాజ్ఞవల్క జయంతి.. నవంబరు 23 దేవుత్థాన ఏకాదశి.. నవంబరు 24 శుక్రవారం, క్షీరాబ్ది ద్వాదశి.. నవంబరు 26 ఆదివారం, జ్వాలా తోరణం.. నవంబరు 27 కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీకపూర్ణిమ.. డిసెంబరు 4న కార్తీకమాసం మూడో సోమవారం.. డిసెంబరు 11న కార్తీకమాసం నాలుగో సోమవారం.. డిసెంబరు 13 బుధవారం పోలి స్వర్గం.. ఇది కార్తీకమాసం చివరి రోజు..

You may also like

Leave a Comment