కార్తీక మాసం లో ప్రతి ఒక్కరు కూడా తెల్లవారే నిద్రలేచి దిపాన్ని వెలిగించి శివుడికి ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటారు. పవిత్రమైన కార్తీకమాసంలో దీపాన్ని వెలిగించడం చాలా ముఖ్యమైనది. దానధర్మాలు చేస్తే కూడా కార్తీకమాసంలో ఎంతో పుణ్యం లభిస్తుంది కార్తీకమాసంలో శక్తి కొద్ది దానధర్మాలు చేస్తే మంచిదని శాస్త్రాలు కూడా చెప్పడం జరిగింది. చేసే సహాయం చిన్నదైనా పెద్దదైనా మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తే అధిక పుణ్యం ఫలితం లభిస్తుంది.
కార్తీక మాసం మొదలైన 11వ రోజు నుండి 20వ రోజు వరకు ఏ దానాలు చేయడం వలన ఎటువంటి పాపాలు తొలగిపోతాయి అనేది మనం తెలుసుకుందాం… 11వ రోజు విభూది, పండ్లు, దక్షిణతో సహా దానం చేస్తే మంచిది. 12వ రోజు పరిమళ ద్రవ్యాలు స్వయంపాకం రాగి దానం చేస్తే మంచిది. భూదేవి సమేత మహావిష్ణువు ని పూజించడం వలన బంధ విముక్తి కలుగుతుంది. 13వ రోజు మల్లెపూలు, జాజిపూలు వంటి పూలు దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 14వ రోజు నువ్వులు, ఇనుము, గేదెలను దానం చేస్తే మంచిది.
Also read:
యమధర్మరాజుని పూజిస్తే అకాల మృత్యువు తొలగిపోతుంది. 15వ రోజు అన్నం భోజనం, వెండి దానం చేయడం మంచిది. 16వ రోజు నెయ్యి, సమిదలు, దక్షిణ, బంగారం దానం చేయడం మంచిది. 15వ రోజు ఔషధాలు, డబ్బు దానం చేయడం మంచిది. 18వ రోజు పులిహోర, అట్లు, బెల్లం దానం చేయడం మంచిది. 19వ రోజు కుడుములు, నువ్వులు దానం చేసి, వినాయకుడిని పూజిస్తే మంచిది. 21 వ రోజు గోవు, భూమి, సువర్ణ దానాలు చేసి నాగులను పూజిస్తే మంచి జరుగుతుంది. చూశారు కదా కార్తీకమాసంలో ఎటువంటి వాటిని పాటిస్తే ఏం జరుగుతుంది అనేది మరి ఇక మీరు కూడా ఆచరించేయండి,