ఏపీ (AP) రాజకీయాల్లో ఊహించని పోరు మొదలైందని అనుకొంటున్నారు.. నేను తెలంగాణ బిడ్డను ఇక్కడే రాజకీయాల్లో ఉంటానని చెప్పిన వైఎస్ షర్మిల.. చివరకు పొలిటికల్ మైలేజ్ ఇవ్వని తెలంగాణ కన్నా ఏపీ బెటర్ అనుకోని అక్కడికి షిఫ్ట్ అయ్యింది. అయితే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహారించి ఆ బాణాన్ని జగన్ వైపు గురిపెట్టడంలో సక్సెస్ అయ్యిందని అనుకొంటున్నారు. దీంతో ఏపీలో అన్నా చెల్లెలు రాజకీయం ఆసక్తికరంగా మారింది..
ఈ క్రమంలో వైసీపీని (YCP) టార్గెట్ చేసిన ఏపీ కాంగ్రెస్ (Congress) చీఫ్ వైఎస్ షర్మిల ఒక రేంజ్ లో విరుచుకుపడటం తెలిసిందే.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సైతం ధీటుగా బదులిస్తున్నారు. మొత్తానికి వైసీపీ నేతల కౌంటర్ తో.. ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ మారాయి. ఈ క్రమంలో వైఎస్ షర్మిల (YS Sharmila)పై మంత్రి కారుమూరి నాగేశ్వర్ (Minister Karumuri Nageshwar) కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరహాలోనే షర్మిల కూడా చంద్రబాబుకు ప్యాకేజీ స్టార్ అని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించిన కాంగ్రెస్‌తో షర్మిల చేతులు కలిపారని మండిపడ్డ కారుమూరి.. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారని విమర్శలు చేశారు.. అవగాహన లేకుండా విమర్శలు చేయడం తగదని సూచించారు. మరోవైపు జనసేన, టీడీపీ పొత్తుపైన సంచలన వ్యాఖ్యలు చేశారు..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లది అమావాస్య పొత్తు అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయం నాటికి జనసేన, టీడీపీల పొత్తు కుక్కులు చింపిన విస్తరి అవుతోందని కారుమూరి నాగేశ్వర్ ఆరోపించారు.. సీఎం జగన్ ప్రకటించే మేనిఫెస్టో తుఫాన్లో ప్రతిపక్షాలు అడ్రస్ లేకుండా గల్లంతవుతాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా జగన్ నవరత్నాలు అమలు చేశారని.. మరోసారి ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.