Telugu News » Kavitha : ఓబీసీ కోటా విషయంలో తగ్గేది లేదు!

Kavitha : ఓబీసీ కోటా విషయంలో తగ్గేది లేదు!

మ‌హిళా బిల్లులో ఓబీసీ మ‌హిళ‌ల్ని చేర్చ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు కవిత. అన్ని వ‌ర్గాల మ‌హిళ‌ల్ని చేర్చుకోవ‌డ‌మే ఇందులో ముఖ్య‌మైన విష‌య‌మ‌ని చెప్పారు.

by admin
kavitha-says-will-fight-till-obc-women-included-in-womens-quota-law

ఈమధ్యే మహిళా బిల్లు (Women reservation Bill) కు ఆమోద ముద్ర పడింది. ఉభయ సభల్లో బిల్లు పాస్ అయ్యాక.. రాష్ట్రపతి దగ్గరకు వెళ్లగా ఆమె కూడా ఓకే చెప్పారు. ఆ వెంటనే గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అయితే.. మహిళా బిల్లులో ఓబీసీ కోటా విషయంలో పోరాటం చేస్తామని అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha). లండన్ (London) పర్యటనలో ఉన్న ఆమె.. ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలు, వ‌ర్గాలు, అన్ని ఆర్థిక స్థితిగ‌తుల‌కు చెందిన మ‌హిళ‌ల‌ను చేర్చాల‌ని డిమాండ్ చేశారు.

kavitha-says-will-fight-till-obc-women-included-in-womens-quota-law

మ‌హిళా బిల్లులో ఓబీసీ మ‌హిళ‌ల్ని చేర్చ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు కవిత. అన్ని వ‌ర్గాల మ‌హిళ‌ల్ని చేర్చుకోవ‌డ‌మే ఇందులో ముఖ్య‌మైన విష‌య‌మ‌ని చెప్పారు. భార‌తీయ స‌మాజంలో ఓబీసీల వ‌ర్గం చాలా పెద్ద‌ద‌ని, వారిని ఆ కోటాలో చేర్చే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం భారత పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలుగా ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కు చేరుతుందని చెప్పారు కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటుకు తీసుకురావడంలో 1996లో దేవెగౌడ ప్రభుత్వం, 2010లో సోనియా గాంధీ, 2023లో ప్రధాని నరేంద్ర మోడీ కీలకంగా వ్యవహరించారని, వారికి ధన్యవాదాలు తెలిపారు.

లండన్‌ లో బ్రిడ్జ్ ఇండియా “మహిళా రిజర్వేషన్లు – ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం’’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా బిల్లును పార్లమెంటు ఆమోదించాలని తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ సగం జనాభాను ఇంటికి పరిమితం చేస్తే దేశానికి మంచింది కాదని అభిప్రాయపడ్డారు కవిత.

You may also like

Leave a Comment