ధర్మపురి అరవింద్ మాటలను పొదుపుగా వాడినట్టే ఉంటుంది.. మాట్లాడే మాటలు మాత్రం తుపాకి గుండుకంటే ఎక్కువ నొప్పికలిగేలా ఉంటాయని అంటారు.. ఎప్పుడు మాట్లాడిన కట్టే కొట్టే తెచ్చేలా ఉండే విమర్శలు ప్రతి పక్షాల గుండెలో సూటిగా గుచ్చుకుంటాయనే పేరు తెచ్చుకున్నారు. ఇక తాజాగా ధర్మపురి అరవింద్ (Dharmapuri-Aravind)..కాంగ్రెస్ (Congress) బీఆర్ఎస్ (BRS)పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో నువ్వు చెప్పింది ఏంటీ? చేసేది ఏంటని బీఆర్ఎస్ ప్రభుత్వం పై అరవింద్ మండిపడ్డారు.. రాష్ట్రాన్ని అన్యాయం చేయడానికా రాజకీయాల్లోకి వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు వెనకేసుకున్న అవినీతి ధనంతో తెలంగాణ అప్పులన్నీ తీరిపోతాయని అరవింద్ ఆరోపించారు.. కమిషన్ల కక్కుర్తితో కాళేశ్వరం కడితే.. గోదావరి నదిలో మునిగిందని కేసీఆర్ పై మండిపడ్డ అరవింద్..లక్ష కోట్ల రూపాయలు గంగలో కలిపాడని ఆరోపించారు..
మరోవైపు కాంగ్రెస్ పసుపు రైతులను మోసం చేసిందని ఆరోపణలు చేసిన అరవింద్.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. బీఆర్ఎస్ కు ఓటు వేసినట్టేనని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల (Jagityala)జిల్లా కోరుట్ల (Korutla) నియోజకవర్గంలోని పలు గ్రామాలను అరవింద్ సందర్శించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనం చేసిన కేసీఆర్.. నిరుద్యోగుల పాలిట యముడిలా మారాడని మండిపడ్డారు.. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరూ అవినీతినిమయంలో మునిగిపోయి.. ప్రజల సంపదను దోచుకుంటున్నారని అరవింద్ ఆరోపించారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు అరవింద్.. బెల్టు షాపులు లేకుండా చేస్తామని ఎనిమిది పైసలు వడ్డీకి మహిళా రుణాలు అందిస్తామని, నిరుపేదలందరికీ పక్కా ఇండ్లు నిర్మిస్తామన్నారు అరవింద్.. రాష్ట్రంలో రైతులు, మహిళలను మోసం చేస్తున్న కేసీఆర్ ఫకీర్ మాటలు అర్థం చేసుకోవాలని ఓటర్లకు సూచించారు.. బీజేపీని గెలిపించాలని కోరారు..