తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇంటి పక్కన (House beside) క్షుద్రపూజలు (Black Magic) కలకలం రేపాయి. హైదరాబాద్ నందినగర్(Nandi nagar)లోని కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో రాత్రిళ్లు క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు అక్కడ కనిపించాయి.
గుడ్డతో చేసిన బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయాలు, ఓ కవర్లో నల్లకోడి, దాని ఈకలు, పసుపు కుంకుమ ఆనవాళ్లు కనిపించాయి.అయితే, వీటిని కేసీఆర్ ఇంటి పక్కనే నిర్వహించారా? లేక వేరే ఎక్కడైనా క్షుద్రపూజలు జరిపి అనంతరం వాటి ఆనవాళ్లను ఇక్కడ పడేశారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే, వీటిని గమనించిన స్థానికులు కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులుఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. పక్కన బిల్డింగులో గల సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్లో ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఇంటికి సమీపంలో క్షుద్రపూజలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
అయితే, కేసీఆర్కు దైవభక్తి చాలా ఎక్కువ. వాస్తును కూడా దృఢంగా నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే క్షుద్రపూజల గురించి ఆయనకు తెలిస్తే దీనిపై ఏం చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలే గులాబీ బాస్ అధికారానికి దూరమై ప్రస్తుతం ఫాంహౌస్లో ఉంటున్నారు.పార్టీలోని కీలక నేతలు బయటకు వెళ్లిపోతున్నారు. కూతురు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్నారు. కేసీఆర్ కాలు జారీ పడిపోవడానికి కూడా ఈ క్షుద్రపూజలే కారణం అని కొందరు చర్చించుకుంటున్నారు.