ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి మధ్య అసలు పోలికే లేదని తెలిపారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తే… రేవంత్ మాత్రం ప్రజల కోసమే పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు కూడా ఇంగ్లీష్ తెలియనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని వెల్లడించారు. రేవంత్ ఇంగ్లీష్‌పై విమర్శలు చేయడం తెలివి తక్కువతనమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని కేఏ పాల్ కొనియాడారు.
బీఆర్ఎస్ హయాంలో రూ.12లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితి మారుతోందని చెప్పారు. వచ్చే అక్టోబర్ నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సైతం మారబోతోందని చెప్పారు. రేవంత్‌తో కలిసి ప్రపంచంలోని బిలియనీర్స్‌ను కలిసి పెట్టుబడులు తెస్తామన్నారు.
ఇది ఇలా వుంటే తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేఏ.పాల్, ఆయన కోడలితో కలిసి అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే అనుమతి లేదంటూ కేఏపాల్‌ను గేటు వద్దే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. కొంత సమయం ఆయనకు అనుమతి లభించింది. దీంతో సెక్రటరీ ఛాంబర్‌లో కూర్చున్నారు. ఏపీ సీఎం జగన్ వేస్ట్ ఫెల్లో అని ఫైర్ అయ్యారు, రూ. పది లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు.