Telugu News » KCR Nomination: కామారెడ్డి, గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ నామినేషన్ అప్పుడే..!

KCR Nomination: కామారెడ్డి, గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ నామినేషన్ అప్పుడే..!

ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర దేవాలయంలో పూజలు చేయడం సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్‌.

by Mano

అసెంబ్లీ ఎన్నికల(Telangana assembly elections) నేపథ్యంలో సీఎం కేసీఆర్(CM KCR) ఇప్పటికే దూకుడు పెంచారు. రోజుకు మూడు సభలతో ఫుల్ బిజీ అయిపోయారు. కేసీఆర్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కామారెడ్డి(Kamareddy), గజ్వేల్(Gajwel) నియోజకవర్గాల్లో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్(Nomination) దాఖలు చేయనున్నారు.

kcr

 

ఇవాళ సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలంలోని కోనాయిపల్లికి వెళ్తున్నారు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ చేయబోతున్నారు. ఆ తర్వాత.. నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేయనున్నారు. రెండు నామినేషన్ల పత్రాలను స్వామి పాదాల దగ్గర ఉంచి, పూజ చేసి, ఆ తర్వాత నామినేషన్లపై సంతకాలు చేస్తారు. కానీ వాటిని ఇవాళ ఇవ్వరు. ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు.

 

ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర దేవాలయంలో పూజలు చేయడం సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్‌. అక్కడ పూజల అనంతరం కేసీఆర్ నామినేషన్ వేస్తారు. ఎన్నికల వేళ సీఎం కేసీఆర్, హరీశ్ రావు తదితర పార్టీల నేతలు స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేస్తారు. కేసీఆర్ ఇక్కడ 1985 నుంచి నామినేషన్ పత్రాలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి హరీశ్ రావు ఆలయాన్ని రూ.3కోట్లకు పైగా వెచ్చించి ఆలయాన్ని పునర్నిర్మించారు. పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ నిర్మాణం, ధ్వజస్తంభం, మూలవిరాట్, ప్రహరీ నిర్మాణాలు చేపట్టారు. ఫిబ్రవరి 2022లో ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. గ్రామంలో మరో రూ.50 లక్షలతో కల్యాణ మండపాన్ని కూడా నిర్మించారు. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారీ సీఎం కేసీఆర్ విజయం సాధించారు.

1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినందున 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018 ఎన్నికల సందర్భంగా ఈ ఆలయంలో పూజలు చేసి నామినేషన్లు వేశారు. అన్ని సందర్భాల్లోనూ సీఎం కేసీఆర్ విజయం సాధించాడు. 2001లో సీఎం కేసీఆర్ టీడీపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఈ ఆలయంలో పూజలు చేసి టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీని ప్రకటించడం మరో విశేషం.

You may also like

Leave a Comment