Telugu News » Kerala Judge: మహిళా న్యాయమూర్తి భరత నాట్యం.. మార్మోగిన ఆడిటోరియం..!

Kerala Judge: మహిళా న్యాయమూర్తి భరత నాట్యం.. మార్మోగిన ఆడిటోరియం..!

కొల్లాం ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్ ఈఎస్ఐ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీతా విమల్.. కేరళీయం వేడుకల్లో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరతనాట్య ప్రదర్శన ఇచ్చి చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

by Mano
natyam

స్టేజ్‌పై భరతనాట్యం(Bharatha Natyam) ప్రదర్శనతో ఓ మహిళా జడ్జి(Judge) అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న కేరళీయం వేడుక(Keraleeyam fest)లో భాగంగా ఆమె తిరువనంతపురం(Thiruvananthapuram)లోని నిశాగంధి ఆడిటోరియం(Nishagandhi auditorium)లో నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆమె ప్రదర్శనకు ప్రేక్షకులు, రాజకీయ నాయకులు మంత్రముగ్ధులయ్యారు. హర్షధ్వానాలతో ఆడిటోరియం మార్మోగింది.

natyam

కొల్లాం ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్ ఈఎస్ఐ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీతా విమల్.. కేరళీయం వేడుకల్లో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరతనాట్య ప్రదర్శన ఇచ్చి చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే, సునీత.. జడ్జి అని ఆడిటోరియానికి వచ్చిన చాలా మందికి తెలియదు. ప్రదర్శన ముగిశాక ఆమెను అభినందిస్తూ ఆమె డ్యాన్సరే కాదు.. జడ్జి కూడా.. అని ప్రకటించారు. దీంతో ఆ విషయం తెలియనివారు ఆశ్చర్యానికి గురయ్యారు.

కేరళీయం వేడుకల్లో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్, మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తదితరులు నేరుగా వేదిక వద్దకు వెళ్లి జస్టిస్ సునీతా విమల్‌ను అభినందించారు. తాను మహిళా న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించినా భరతనాట్యాన్ని మర్చిపోలేదని కార్యక్రమం అనంతరం జస్టిస్ సునీతా విమల్ తెలిపారు. ఉదయం 4:30 గంటలకు లేచి 6 గంటల వరకు భరతనాట్యాన్ని సాధన చేస్తానని చెప్పారు.

డ్యాన్స్ ఇష్టమా? లేక న్యాయమూర్తిగానా? అని అడిగితే.. ఆమె తన మొదటి ప్రాధాన్యత జడ్జి వృత్తికేనని చెప్పడం విశేషం. కానీ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలనని ఆమె తెలిపారు. జస్టిస్ సునీత తన పాఠశాల రోజుల నుంచి భరతనాట్యం, మోహినిఅట్టం నేర్చుకున్నారు. జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆమె ఖాళీ సమయం దొరికినప్పుడల్లా భరతనాట్యం సాధన చేస్తుండేవారు. ఇప్పటివరకు చాలా ఆలయాల్లో ఆమె భరతనాట్యం ప్రదర్శన ఇచ్చారు.

You may also like

Leave a Comment